బాబు స్పందించరే ? జగన్ ఆరోపణలు నిజమేనా ?

అందరి మీద విమర్శలు చేస్తూ నిత్యం హడావుడి చేసే టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వైసిపి నాయకులు ఏ విషయం పైన అయినా, టీడీపీని ఉద్దేశించి విమర్శలు చేస్తే, వెంటనే బాబు రంగంలోకి దిగి పోయి ప్రతి విమర్శలు చేస్తూ, ఆ విషయంలో మీడియాలో హైలెట్ అవుతూ, పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తారు. మొదటి నుంచి ఇది చంద్రబాబుకు అలవాటుగా మారింది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నో విమర్శలు ప్రతి విమర్శలు చేస్తూ, తనకు తిరుగులేకుండా చేసుకుంటూ వస్తున్నారు. అయితే మొన్నటి వరకు వేరు, ఇప్పుడు వేరు, ఇది జగన్ పరిపాలన. మీ పప్పులు ఏమీ ఉదకవు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.



 జగన్ ఎప్పుడూ పెద్దగా  ఏ విషయంలోనూ స్పందించరు. కేవలం ఆ పార్టీ నాయకులే విమర్శలు చేస్తూ ఉంటారు. కానీ జగన్ తాను చేయాల్సింది ఏదో మూడో కంటికి తెలియకుండా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు జగన్ నేరుగా విమర్శలు చేయకుండానే, తన సలహాదారు అజయ్ కల్లాం  ద్వారా చేయించారు. బాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారనేది వైసిపి ప్రధాన విమర్శ. దీనిపై బాబు చిన్న మాట కూడా మాట్లాడటం లేదు. కేవలం అమరావతి వ్యవహారంపై పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దానిమీదే హడావుడి చేస్తున్నారు తప్ప, వైసిపి విమర్శలపై స్పందించడం లేదు. జగన్ వ్యవహారాన్ని ఇప్పుడు ఆషామాషీ వ్యవహారం డీల్ చేయడం లేదు. ఏకంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి మీద ఫిర్యాదు చేశారు. అది కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి. తనకు ఉన్న అన్ని అనుమానాలను వ్యక్తం చేస్తూ జగన్ లేఖ రాయడం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. 


చంద్రబాబు జగన్ ఆరోపణల మీద స్పందించడం లేదు. అసలు జగన్ లేఖ రాస్తారని బాబు ముందుగా ఊహించలేకపోయారు. కానీ ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి మీద ప్రధాన న్యాయమూర్తి ఫిర్యాదు చేయడం బాబుకు సైతం షాక్ కలిగిస్తోంది. ఈ విషయంలో ఏం మాట్లాడినా తాను ఇరుకున పడతాను అనే విషయం బాబుకు బాగా తెలుసు. అందుకే జగన్ ఎన్ని విమర్శలు చేస్తూ, లేఖలు రాస్తూ, హడావుడి చేస్తున్న బాబు మాత్రం ఈ వ్యవహారంపై స్పందించడం లేదు. కనీసం ఆ పార్టీ నాయకులు కూడా ఎక్కడా స్పందించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: