థియేటర్లు తెరుచుకున్నా... బొమ్మ పడటం కష్టమే..!

praveen
దేశంలో కరోనా  వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వైరస్ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ముఖ్యంగా సినిమా రంగంపై అయితే మరింత ఎక్కువగా పడింది ఈ మహమ్మారి కరోనా  వైరస్ ప్రభావం. దేశంలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చి లాక్ డౌన్  అమలులోకి  రాగానే  అన్ని రకాల షూటింగులు నిలిచి పోయాయి అని చెప్పాలి. అంతేకాకుండా సినిమా థియేటర్లు కూడా మూతపడ్డాయి. ఈ క్రమంలోనే షూటింగ్ దశలో ఉన్న సినిమాల  పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాల పరిస్థితి మాత్రం ఇంకా అయోమయం లో పడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఇదే క్రమంలో ఓటీటీ కి  బాగా డిమాండ్ పెరిగి పోవడంతో ఓటీటీ వేదికగా పలు సినిమాలను విడుదల చేశారు.

ఇటీవలే అన్లాక్ 5.0 లో భాగంగా కేంద్రం నుంచి సినిమా థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి అయితే కఠిన నిబంధనల మధ్య ఈ సినిమా థియేటర్లు నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే సినిమా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ నేపథ్యంలో ఎంతోమంది అభిమానులు సినిమా థియేటర్లకు వెళ్లి ఎన్నో రోజుల తర్వాత థియేటర్ అనుభవాన్ని పొందాలి అని అనుకుంటున్నారు. కానీ ప్రేక్షకులకు మాత్రం నిరీక్షణ తప్పదు అన్నది అర్థమవుతుంది.


 ఎందుకంటే సినిమా థియేటర్లు తెచ్చుకున్నప్పటికీ బొమ్మ పడే అవకాశం మాత్రం తక్కువే ఉంది. ఎందుకంటే లాక్ డౌన్ కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు తెరుచుకునేందుకు అనుమతి రాగా తెలుగు రాష్ట్రాల్లో  సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే ఇప్పట్లో  కొత్త సినిమాలు ఏవీ లేకపోవడం... ఇప్పుడిప్పుడే సినిమా షూటింగులు మొదలవుతున్న తరుణంలో... ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ  సినిమాలు విడుదలయ్యే అవకాశాలు మాత్రం తక్కువగానే ఉన్నాయి. దీంతో అటు ప్రేక్షకులకు నిరీక్షణ తప్పదు అన్నది అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: