70 మంది భార్యలు.. 210 మంది పిల్లలు.. వామ్మో ఇదేం రికార్డ్.?

praveen
మామూలుగా గతంలో జరిగిన కొన్ని సంఘటనలు తెలిస్తే అది నిజం అని నమ్మడానికి కొన్నిసార్లు వెనక ముందు ఆలోచిస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే. గతంలో జరిగిన కొన్ని ఘటనలు సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విధంగా ఉంటాయి. ఎవరికైనా ఒక పెళ్లి జరుగుతుంది... మహా అయితే రెండో పెళ్లి చేసుకుంటారు.. ఇంకా ఆసక్తి ఉంటే మూడో  పెళ్లి చేసుకుంటారు.. అంతే కానీ ఏకంగా 70 మందిని అధికారికంగా పెళ్లి చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం అదే చేశాడు. 71 మందిని అధికారికంగా పెళ్లి చేసుకోవడమే కాదు వారందరితో కూడా పిల్లల్ని కన్నాడు.




 అది కూడా ఒక్కరో ఇద్దరో  అనుకుంటే పొరపాటు... ఎందుకంటే 70 మంది భార్యలకు ఏకంగా  210 మంది పిల్లలు ఉన్నారు. ఏంటి షాక్ అయ్యారు కదా... కానీ ఇది నిజం గానే జరిగింది. 70 పెళ్లిళ్లు  చేసుకొని 210 మంది పిల్లలను కన్న మహానుభావుడు ఎవరు అని అంటారా. ఆఫ్రికా లోని ఓ చక్రవర్తికి ఈ ఘనత సాధ్యమైంది. ఆఫ్రికా లోని చక్రవర్తి ఏకంగా 82 ఏళ్ల పాటు ఆఫ్రికా స్వాజిలాండ్   పాలించడమే కాదు 70 మందిని  అధికారికంగా పెళ్లి చేసుకుని 210 మంది పిల్లలను కన్నాడు.



 అంతేకాదు మరో ఘనత కూడా సాధించాడు. సుదీర్ఘకాలం పాటు ఓ దేశానికి  చక్రవర్తిగా ఉన్న గనత కూడా సాధించాడు ఆఫ్రికాలోని స్వాజిలాండ్  మాజీ చక్రవర్తి సో భుజకి .  అధికారిక లెక్కల ప్రకారం ఆయన 82ఏళ్ల 256 రోజులపాటు చక్రవర్తిగా కొనసాగాడు. తండ్రి  చనిపోవడంతో నాలుగునెలల వయసులోనే ఆయనను  రాజుగా ప్రకటించారు మైనార్టీ తీరిన తర్వాత పాలన అప్పగించారు.. 1982లో ఆయన చనిపోయే నాటికి ఏకంగా అధికారికంగా 70 మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు. వారందరితో కలిసి 210 మంది పిల్లలను కన్నాడు సదరు రాజు. ఇప్పటికీ మొత్తం మనవలు మనవరాళ్ల సంఖ్య వెయ్యికి పైగా నే ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: