థియేటర్ల అనుమతి విషయంలో మోడీ మాట జగన్ వింటాడా...

VAMSI
కరోనా మహమ్మారి  కారణంగా దాదాపు ఆరు నెలలుగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్నిరోజులుగా అన్ని అన్నింటికీ అన్ లాక్ డౌన్ చేసినప్పటికీ, ప్రజలంతా ఎంతో సంతోషంగా ఆనందపడే సినిమా థియేటర్ల విషయంలో మాత్రం ఇంకా ఒక స్పష్టత రాలేదు. దీనితో తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏమిచేయాలో పాలుపోక తమ తమ ప్రాజెక్టులను వాయిదా వేసుకుంటూ పోతున్నారు. అయితే తాజాగా కేంద్రం మాత్రం థియేటర్లకు కూడా అనుమతి ఇవ్వడంతో అన్ని సినిమా పరిశ్రమల పెద్దలు సంతోషపడ్డారు.
అయితే దీనికి కొన్ని నిబంధనలను మరియు మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం .  ఈ నెల 15 నుంచి థియేటర్లో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే థియేటర్లు నడుపుకోవచ్చని కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే ఇక్కడే ఒక మెలిక పెట్టింది కేంద్రం, మేము అయితే అనుమతులు ఇచ్చాము కానీ తుది నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు.  దీనితో దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వలేదు అనే చందముతో ఈ విషయంలో సందిగ్ధత ఏర్పడింది. ఎందుకంటే కరోనా ప్రభావం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంది కాబట్టి తీవ్రతను బట్టి రాష్ట్రాల ప్రభుత్వాలే ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మీరు కనుక తెలంగాణ రాష్ట్రములో పరిస్థితి చూస్తే థియేటర్లు తెరిచేలాగే కనిపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ కరోనా ప్రభావం పెద్దగా లేదు. కేసులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ దీనికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందుకు అవకాశం లేనట్లే అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏపీలో ఇప్పటికీ రోజువారీ కేసులు 7-8 వేల మధ్య ఉంటున్నాయి. మరణాలు కూడా ఎక్కువే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు తెరవాలన్న నిర్ణయాన్ని మరోసారి వాయిదా వేశారు. కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గని పరిస్థితుల్లో  మేము ఇప్పుడే ఏ నిర్ణయం తీసుకోలేమని ఇంకా కొన్ని రోజులు ఆగాలని థియేటర్ల యాజమాన్యాలకు చెబుతారని సమాచారం. దీనినిబట్టి చూస్తే ఇంకా ఒక నెల రోజులు సమయం పట్టేలా ఉందని అర్ధమవుతోంది. కాబట్టి ఖచ్చితంగా దీపావళికి పూర్తిస్థాయిలో థియేటర్లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంది అని సినీ వర్గాలు చెప్పుకుంటున్నారు. మరి జగన్ త్వరగా దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: