నేడు అతిపెద్ద పొడవైన అటల్ టన్నెల్ ప్రారంభం...!
ఈ సొరంగం మనాలీ నుంచి లాహోల్‌స్పిటి లోయ వరకు నిర్మించారు. ఈ సొరంగం కారణంగా మనాలీ నుంచి లఢక్ లోని లేహ్ వరకు 7 గంటల రోడ్డు ప్రయాణ సమయం, 45 కిలో మీటర్ల దూరం తగ్గుతాయి. అలానే మంచు కూడా ఇక్కడకి రాదు. అలానే ఈ సొరంగం వల్ల మరో లాభమేమిటో తెలుసా... లఢక్, అక్సాయ్ చిన్ సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యానికి ఆయుధాలు, ఆహారం పంపేందుకు దీనిని ఉపయోగించొచ్చు. దీనిని ఓపెన్ చేయడానికి ఏర్పాట్లు కూడా జోరుగా సాగాయి. లఢక్ వెళ్లేందుకు ఇన్నాళ్లూ... హిమాచల్ ప్రదేశ్‌లోని రోహతాంగ్ పాస్ వైపు వెళ్లే లేహ్-మనాలీ హైవేను ప్రజలు వాడేవారు.
కానీ ఇది సంవత్సరంలో 4 నెలలు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగిలిన ఎనిమిది నెలలు కూడా మంచుతో కప్పి ఉండేది. అయితే మరో మార్గం లేదా అంటే ఉంది అదే.... కాశ్మీరులోని జోజీలా మీదుగా వెళ్లే శ్రీనగర్-ద్రాస్-కార్గిల్-లేహ్ హైవే. ఈ దారి సంవత్సరంలో 4 నెలలు మూసి ఉంటుంది. ఇన్ని సమస్యలని చూడడం వల్ల రోహతాంగ్ పాస్ కింద సొరంగం నిర్మించాలన్న ఆలోచన మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి రాగా... 2002 మే 26న సొరంగానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం మొదలైంది. అందుకే ఆయన 95వ జయంతి సందర్భంగా దీనికి 'అటల్ టన్నెల్' అని పెట్టడం జరిగింది.