పబ్లిసిటి:ల(జ)గడపాటి

 హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరోమారు వార్తల్లోకి ఎక్కారు. ఎప్పుడూ ఏదో ఒక విషయంతో ఆయన వార్తల్లోకి ఎక్కుతుంటారు. రాజకీయాలన్నీ తన చుట్టూ తిరిగే విధంగా చేస్తుంటారు.   ఆయన చేష్టల వల్ల కాంగ్రెస్ పార్టీకి కొంత నష్టం వాటిల్లుతున్నా....ఆయనకు మాత్రం చెప్పలేనంతగా పబ్లిసిటి వస్తూంది. దీనితో ఎప్పుడూ ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఆయన వివాదస్పదమైన రాజకీయాలకు కేంద్రబిందువుగా మారారు.  తాజాగా విజయవాడలోని కనకదుర్గ దేవాలయంకు సంబంధించి ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 25న విజయవాడలో ధర్నాకు దిగుతున్నట్లు ప్రకటించారు. బాబు ధర్నాకు పోటీగా రాజగోపాల్ బ్రిడ్జి నిర్మాణం వద్దంటూ ఆందోళనకు దిగుతానంటూ ప్రకటించారు. దీనితో విజయవాడ ఒక్కసారిగా వేడెక్కింది. బాబు-రాజగోపాల్ పోటీ ధర్నా ప్రకటనలతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి.  రాజకీయ రాజధానిగా పిలువబడుతున్న విజయవాడలో రాజగోపాల్ ప్రకటనతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. పోటీ ధర్నా నేపథ్యంలో విజయవాడలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విజయవాడ నుంచి రెండో దఫా ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న రాజాగోపాల్ తన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటారు.  ఒక ఎంపీ అయినప్పటికీ రాష్ర్ట నాయకుడిగా రాజకీయాలను తన చుట్టూ తిప్పుకునేందుకు ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. తెలంగాణ విషయంలో కూడా రాజగోపాల్ తరుచూ ఏదో మాట్లాడుతుంటారు. సంచలన వ్యాఖ్యలు చేస్తూ అందర్ని తనవైపు ఆకట్టుకుంటారు. రాష్ర్ట రాజకీయాలు తన చుట్టూ తిరిగే విధంగా చేస్తుంటారు. రాష్ర్టంలో జరిగిన ఉప ఎన్నికల్లో కూడా ‘ప్రజాహిత’ కార్యక్రమం పేరిట పరకాల మినహాయించి అంతటా తిరిగారు. రాష్ర్ట నాయకుడిగా ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గ టెంపుల్ దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం కూడా అదే. ఈ బ్రిడ్జి నిర్మాణం పనులు ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నాయనీ, పనులను వెంటనే చేపట్టాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు చంద్రబాబు సోమవారం నాడు ధర్నా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి కౌంటర్గా రాజగోపాల్ బ్రిడ్జి పనులు ఇప్పుడే చేపట్ట వద్దంటూ ధర్నా చేయనున్నట్లు ప్రకటించారు.  అంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేసి చంద్రబాబును కలిసి వాస్తవ పరిస్థితులను వివరిస్తానంటున్నారు. దీనికి టీడీపీ వర్గాలు అంగీకరించడం లేదు. విజయవాడ ఎంపీ రాజగోపాల్ పోటీ ధర్నాతో మరోమారు అందరూ విజయవాడ వైపు చూస్తున్నారు. మొత్తానికి రాజగోపాల్ ప్రకటనతో అంతా ఉత్కంఠ నెలకొంది. సంచలన ప్రకటనలతో రాజకీయాలను తను చుట్టూ తిప్పుకునే విషయంలో రాజగోపాల్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. నయా పైసా ఖర్చు లేకుండా రాజగోపాల్ కు బోలెడు పబ్లసిటి వస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దటీజ్ ల(జ)గడపాటి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: