భక్తులకు భారీ షాక్.. మరో 3 నెలల పాటు ఆలయం మూసివేత..?

praveen
కరోనా  వైరస్ పుణ్యమా అని అటు దేవుడికి ప్రజలకి మధ్య చాలా దూరం పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఒకప్పుడైతే ఏ కష్టం వచ్చినా దేవుడి దగ్గరికి వెళ్లి... తమ సమస్యను పరిష్కరించుకునేందుకు శక్తి ఇవ్వాలి అని కోరుకునే వారు. కానీ ప్రస్తుతం కరోనా  వైరస్ లాంటి పెద్ద సమస్య వస్తే అటు దేవుడి  ఆలయాలు కూడా మూతపడడంతో ప్రజలందరూ తీవ్ర నిరాశ చెందుతున్నారు. దేవుడి దగ్గరికి వెళ్లి తమ బాధలు చెప్పుకుందాం  అన్న అవకాశం లేని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో కరోనా  వైరస్  శర  వేగంగా వ్యాప్తి చెందుతూ.. ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ ఆలయాల అధికారులు ఆలయాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ... ఆలయ అర్చకులు సిబ్బంది కూడా కరోనా  వైరస్ బారిన పడుతుండటం తో మళ్లీ ఆలయం మూసివేసే  పరిస్థితులు వస్తున్నాయి.


 దాదాపు అన్ని ప్రముఖ ఆలయాలలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్న విషయం తెలిసిందే. ఆలయాల లో వివిధ నిబంధనల మధ్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించినప్పటికీ ఏదో ఒక విధంగా కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉంది. దీంతో చేసేదేమీ లేక ఆలయాలను మూసివేయక  తప్పడంలేదు. ఇటీవలే ఇలాంటి నిర్ణయం తీసుకుని భక్తులకు చేదు వార్త వినిపించారు సమ్మక్క సారలమ్మ ఆలయం నిర్వాహకులు. కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయాన్ని మూసి వేయనున్నట్లు తెలిపారు.


 తెలంగాణలోని ములుగు జిల్లా లో ఉన్న మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయం ఎంత  ప్రఖ్యాతి గాంచినదో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి ఏటా లక్షల మంది భక్తులు అక్కడికి చేరుకొని సమ్మక్క సారలమ్మలకు పూజలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించిన ఆలయ పూజారులు నిర్వాహకులు.. మరో మూడు నెలల పాటు ఆలయాన్ని మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను తెరిచి మళ్లీ మూసివేసిన విషయం తెలిసిందే. ఇక సమ్మక్క సారలమ్మ ఆలయం తెరుస్తారేమో అని అనుకుంటున్న భక్తులకు... మూడు నెలల పాటు ఆలయం మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకోవడంతో భారీ షాక్ తగిలింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: