హరీష్ రావు కే బాధ్యత..ట్రబుల్ షూటర్ పనితనం తెలిసిందేగా..?

P.Nishanth Kumar
హరీష్ రావు కి టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ అనే పేరుంది.. ఎలాంటి పరిస్థితుల్లో అయినా పార్టీ కి ఇబ్బంది వస్తే తీర్చే ఒకే ఒక్క నాయకుడు హరీష్ రావు.. ఈ విషయాన్నీ కేసీఆర్, కేటీఆర్ లు సైతం ఒప్పుకుంటారు. అందుకే ఎక్కడ ఇబ్బంది ఏర్పడినా తమ కంటే ముందు హరీష్ రావు ని ప్రవేశ పెట్టి తమకు అడ్డు లేకుండా చేసుకుంటారు.. అయితే తమకు ఎంతో అచ్చోచ్చిన హరీష్ రావు ను దుబ్బాక విషయంలో ఫుల్ వాడేసుకుంటున్నారు కేసీఆర్.. స్థానిక ఎమ్మెల్యే హఠాత్మరణంతో దుబ్బాక లో ఉప ఎన్నిక అనివార్యమైంది.. అయితే గతంలో గెలిచిన దానికి ఇప్పుడు గెలిచినా దానికి చాలా తేడా ఉంది.. టీఆర్ఎస్ పార్టీ అప్పుడు గెలిచిందంటే అప్పుడు పార్టీ కి అన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు అలా లేదు..
ఓవైపు బీజేపీ కొంత బలపడడం, కాంగ్రెస్ దూకుడు వెరసి టీఆర్ఎస్ కి దుబ్బాక లో గెలుపు అవకాశాలు సన్నగిల్లు తు వచ్చాయి..  ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికకు అంతా సిద్ధమయింది. ఎన్నిక కోసం అన్ని పార్టీలూ సిద్ధమయ్యాయి. ఇప్పటికే దుబ్బాకలో ప్రచారాన్ని అందరూ మొదలుపెట్టారు. ప్రధానంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఒకడుగు ముందుకేసి అభ్యర్థిని ప్రకటించకున్నా గ్రామస్థాయిలో నేతలను నియమించింది. ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నికకు ఇన్ ఛార్జిగా హరీశ్ రావును పార్టీ అధిష్టానం నియమించింది. హరీశ్ రావు దుబ్బాక నియోజకరవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
ఇప్పటికే గ్రామాల వారీగా ఇన్ ఛార్జులను టీఆర్ఎస్ నియమించింది. ఒక్కొక్క గ్రామానికి ఇన్ ఛార్జిని నియమించి వారికే పూర్తి బాధ్యతలను అప్పగించింది. ఓటర్లను ఆకట్టుకోవడం దగ్గర నుంచి పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకువచ్చేంత వరకూ వారిదే బాధ్యత. హరీష్ రావు కూడా తన నియోజకవర్గంలో కూడా చేయనంత పోరాటం ఇప్పుడు చేస్తున్నారు.. వాస్తవానికి హరీష్ ఇంత చేయడానికి లేదు. ఎందుకంటే దుబ్బాక లో ఇంకా అధికార పార్టీ వైపే గాలి వీస్తుంది.. పైగా చనిపోయింది అధికార పార్టీ ఎమ్మెల్యే ఎలాగ సింపతీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎనభై శాతం గులాబీ పార్టీ కే గెలిచే సూచనలు ఉన్నాయి.. ఈ నేపథ్యంలో ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఏవిధంగా తన పార్టీ ని విజయ తీరాలకు ఎక్కిస్తాడో చూద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: