వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు బ్రేక్ ...కారణాలివే...?

VAMSI
2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన వైఎస్ వివేకా హత్య కేసు సంచలనంగా మారింది. సొంత ఇంట్లోనే దారుణంగా హత్యకు గురికావడంతో ఏపీ లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అంతేకాకుండా అప్పట్లో బంధువులే హత్య చేసారని కొందరు, ప్రతిపక్షాలు హత్యచేయించారని మరికొందరు వారి అనుమానాలను వ్యక్తం చేసారు. అయితే వివేకా కూతురు మాత్రం సొంత పార్టీలోని నాయకులే చేసిఉంటారని మొదటినుండి చెబుతూ వస్తున్నారు. అయితే అప్పట్లో అధికారంలో ఉన్న చంద్రబాబు ఈ కేసును జగన్ వైపు మళ్లించడానికి తీవ్ర ప్రయత్నాలు చేసారు.  ఎట్టకేలకు ఈ కేసు సిబిఐ దర్యాప్తుకు వెళ్ళింది. ఏ క్షణంలో సిబిఐ కి వెళ్లిందో గాని అప్పటినుండి  విచారణకు సంబంధించిన పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి.
కొన్ని కారణాలవలన మొదటి విడత విచారణ ఆగింది. తరువాత మళ్ళీ రీసెంటుగా కేంద్రం నుండి వచ్చిన సిబిఐ బృందం విచారణను వేగవంతం చేసింది. అయితే ఈసారి కరోనా వైరస్ కారణంగా విచారణ ఆగేలాగా ఉందని మీడియా వారు అనుకుంటున్నారు. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ అధికారికి కరోనా సోకింది. అయితే  కరోనా లక్షణాలు కనిపించిన మరో అధికారి కూడా పరీక్ష చేయించుకున్నారు. అయితే, ఆ అధికారికి కోవిడ్ నెగటివ్ అని తేలింది. దీంతో కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన సీబీఐ అధికారి వ్యక్తిగత ఐసోలేషన్‌కు వెళ్లారు. దీనితో మిగతా అధికారులకు కూడా కోవిడ్ భయం పట్టుకుంది. కోవిడ్ సోకిన సిబిఐ అధికారి విచారణలో భాగంగా విచారణకు హాజరైన అనుమానితులు కూడా కోవిడ్ బారిన పడే అవకాశం లేకపోలేదు. కాగా ఒక్క వ్యక్తితో కరోనా ఆగిపోతే విచారణ సజావుగా సాగుతుంది. లేదంటే ఈ బృందంలో మిగతా వారికి కూడా కరోనా పాజిటివ్ గా తేలితే వివేకా హత్య కేసు విచారణ మరో సారి వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. మరి ఏమీజరగనుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వ్యవధి పట్టేలా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: