జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. వైద్యులకు శుభవార్త.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.?

praveen
ప్రస్తుతం కరోనా  వైరస్ కష్టకాలంలో ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అది వైద్యులు అన్న విషయం నిర్మొహమాటంగా చెబుతారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే వారేమీ దేవుళ్లు కాదు... అందరిలాగే సాధారణ మనుషులే.. కరోనా  వైరస్ సోకితే  వారి ప్రాణాలకు కూడా ప్రమాదమే.. వారి కుటుంబాలు కూడా ఒంటరి అయ్యే అవకాశం ఉంది.. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా.. విధి నిర్వహణలో ప్రాణాలు సైతం అర్పించేందుకు సిద్ధమయ్యారు వైద్యులు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుపెట్టి... ప్రస్తుతం ప్రజల పాలిట ప్రత్యక్ష దైవం గా మారిపోయారు వైద్యులు.


 కరోనా  వైరస్ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి మరీ పోరాటం చేస్తున్న వైద్యులందరికీ మరింత చేయూత అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకుంటున్న  విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం కరోనా  వైరస్ నియంత్రణలో.. కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. అంతేకాకుండా కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్న వైద్యుల  విషయంలో కూడా... ఇటీవలే కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్ వైద్యులందరికీ శుభవార్త అందించింది.

 కరోనా  వైరస్ కష్టకాలంలో... ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులకు వారి కుటుంబాలకు మేలు జరిగే విధంగా జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుని శుభవార్త అందించింది.  కరోనా  నియంత్రణలో భాగంగా వైద్యులు కోవిడ్  డ్యూటీ చేస్తూ ప్రాణాలు కోల్పోతే సదరు వైద్యుని కుటుంబంలో ఒకరికి కేవలం 30 రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా   ఆదేశాలు జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి  సర్కార్.  కరోనా  పోరాటంలో వైద్యుడు మృతిచెందిన వెంటనే ఆ వివరాలు జిల్లా వైద్యాధికారి కి పంపాలి అంటూ  తెలిపిన ఏపీ ప్రభుత్వం ఆ వివరాలు అందిన వెంటనే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేలా చర్యలు చేపట్టాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: