మీ ఇంటికి గిఫ్ట్ వస్తుందా? తస్మాత్ జాగ్రత్త సుమీ..

Satvika
గజ దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు అన్న సంగతి తెలిసిందే.. ఈ మధ్య దోపిడీలు చేయడానికి దొంగలు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. దాంతో పాటుగా కొత్త అవతారాలను ఎత్తుతున్నారు. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చెడ్డీ దొంగల ముఠా కలకలం సృష్టించారు. ఆ ఘటన మరువక ముందే చాలా ఘటనలు వెలుగు చూశాయి. ఇప్పుడు మరో కొత్త పద్దతులతో డబ్బులను గుంజుతున్నారు.గిఫ్ట్ ల పేరుతో మోసాలు చేస్తున్నారు. 



వివరాల్లోకి వెళితే.. గిఫ్ట్ వస్తుందంటూ జనాలను బురిడీ కొట్టించే గ్యాంగులు తయారవుతున్నారు.తెలుగు రాష్ట్రాల్లో తరహా మోసాలు ఎక్కువగా ఉన్నాయి. వరుసగా జరుగుతున్న ఘటనలతో జనాల్లో ఆందోళన మొదలైంది. విశాఖలో రిటైర్డ్ నేవి అధికారిని కూడా సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు. విశాఖ మహారాణిపేటలో ఉంటున్న ఆయనకు జూన్ 30న ఫేస్‌బుక్‌లో సాండ్రా జేమ్స్‌ నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వచ్చింది. ఇద్దరికి పరిచయమైంది. కొద్దీ రోజుల తర్వాత అతనికి వాట్సాప్ లో మెసేజ్ లు వచ్చాయి. అక్కడ చాట్ చేసింది ఒక మహిళల.. గిఫ్ట్ పంపిస్తానని నమ్మపలికింది.



అందుకు సంబంధించిన రసీదులను వాట్సాప్ లో పంపించింది.రెండు రోజుల తర్వాత ఒక అమ్మాయి పార్శిల్ వచ్చినట్లు అది రావాలంటే 22 వేలు చెల్లించాలని చెప్పింది.అతను నమ్మి బ్యాంక్ ద్వారా ఆ నగదు చెల్లించారు. మరో రెండు రోజులు ఆగి మరో ఫోన్ కాల్ వచ్చింది. పార్సిల్‌ను స్కాన్‌ చేయగా అందులో లక్ష పౌండ్ల నగదు, ఐఫోన్‌, బంగారు వాచ్, యాపిల్‌ ల్యాప్‌టాప్‌, రెండు పెర్ఫ్యూమ్‌ సీసాలు ఉన్నాయని చెప్పారు. అన్నిటి విలువ లక్షల్లో ఉంటుందని అతన్ని నమ్మించారు.1.05 లక్షలు చెల్లించి యాంటీ మనీలాండరింగ్‌ డాక్యుమెంట్‌ను తీసుకోవాలని సూచించారు. అలా ఆయన దగ్గర నుంచి కోటికి పైగా వసూలు చేశారు.ఈ విషయం సీబీఐ దృష్టికి వెళ్లడంతో పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే పోలీసులను ఆశ్రయించిన కు సంచలన నిజాలను పోలీసులు తెలిపారు.ఇలాంటి ఫేక్ కాల్స్ వస్తే నమ్మి మోసపోవద్దని పోలీసులు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: