బాబ్రీ మసీదు కేసులో సంచలన తీర్పు ఇచ్చిన జడ్జి.. చివరికి..?

praveen
దశాబ్దాల నుంచి కోర్టు లో వాయిదా పడుతూ వస్తున్న బాబ్రీ మసీదు కేసు ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో చారిత్రాత్మక తీర్పును వెలువరించింది కోర్టు. బాబ్రీ మసీదు కూల్చివేత కుట్ర పూరితం గా జరగలేదు అంటూ తెలిపిన జడ్జి.. బాబ్రీ మసీదు కూల్చివేతకు ఎలాంటి ఆధారాలు లేవు అంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భం గా బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 2000 పేజీల  తీర్పును న్యాయ మూర్తి ఎస్కె యాదవ్ చదివి వినిపించారు.




 దీంతో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో దశాబ్దాల నుంచి నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులను నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఈ కేసులో ఉన్న  ఆడియో వీడియో ఆధారంగానే... బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దోషులుగా తేల్చలేమని అంటూ కోర్టు స్పష్టం చేసింది. అందుకే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని నిర్దోషులుగా తేలుస్తూ కోర్టు తీర్పు ఇచ్చినట్లు తెలిపింది.



 దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఈ కేసులో ఈరోజు చారిత్రాత్మక తీర్పు వెలువడింది. లక్నోలోని ఓల్డ్ హైకోర్టులో తీర్పును వెలువరించారు. ఈ తీర్పు వెలువరించిన నేపథ్యంలో... బయట భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ సంచలన తీర్పు ఇచ్చే న్యాయమూర్తి ఎస్ కే యాదవ్ ఈరోజే  రిటైర్మెంట్ తీసుకోవడం గమనార్హం. ఎందుకంటే న్యాయమూర్తి ఎస్ కే యాదవ్ పదవి కాలం కూడా నేటితో ముగియనుంది. వాస్తవంగా అయితే గత ఏడాది ఆయన రిటైర్ అవ్వాల్సి ఉన్నప్పటికీ ఈ కేసులో తీర్పు ఇచ్చేందుకు ఆయన రిటైర్మెంట్ ను ఒక ఏడాది పాటు పొడగించుకున్నారు. నేటితో  ఆయన రిటైర్మెంట్ కాలం ముగియనుండగా సంచలన తీర్పును వెలువరించి రిటైర్ అయ్యారు ఎస్ కే యాదవ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: