
కరోనా నిబంధనలను ఉల్లంఘించిన 24 వేల మందికి జరిమానా విధించిన ఢిల్లీ ప్రభుత్వం
ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రకారం సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 27 తేదీల మధ్య కరోనా నిబంధనలను ఉల్లంఘించిన 23, 922 మంది ప్రజలకు జరిమానా విధించారు అధికారులు. కేవలం జరిమానాలు మాత్రమే కాదు కొందరి పై ఎఫ్ఐఆర్ లు కూడా నమోదయ్యాయి. గత వారంలో అధికారులు దాదాపు ఒక కోటి ఇరవై లక్షల రూపాయల జరిమానాలను వసూలు చేశారు అంటే అతిశయోక్తి కాదు. సెప్టెంబర్ 18వ తేదీన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎవరైతే నిబంధనలను ఉల్లంగిస్తారో వారిపై జరిమానా విధించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఢిల్లీ లోని అన్ని ప్రాంతాల్లో చాలామంది ప్రజలు మాస్కులు ధరించకుండానే బయట యథేచ్ఛగా తిరుగుతున్నారు. కరోనా జాగ్రత్తల నిబంధనల ఉల్లంఘన పశ్చిమ జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదు. ఢిల్లీ సెంట్రల్ జిల్లాలలో 3 వేల మంది ఫేస్ మాస్క్ లేకుండా పట్టుబడ్డారు. అధిక రద్దీ ఉన్న ప్రాంతాలు చాందిని చౌక్, కాశ్మీర్ గేట్, సదర్ బజార్ సెంట్రల్ జిల్లాలుగా పరిగణిస్తారు.