కరోనా వ్యాక్సిన్లు వచ్చేసాయి...ఎక్కడో తెలుసా...?

VAMSI
కరోనా వైరస్ ని నాశనంచేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. రీసెంటుగా రష్యా విడుదల చేసిన కరోనా వైరస్ ఇంకా అందుబాటులోకి రాలేదన్న విషయం తెలిసిందే. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది ప్రథమార్ధంలో అందరికీ అందుబాటులోకి వస్తుందని రష్యా వారు తెలియచేసారు. ఈ కరోనా వ్యాక్సిన్ పై రోజుకో వార్త వెలువడుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో అని సందిగ్ధంలో పడుతున్నారు. అయినా ప్రాణంపైనా ఆశ, కరోనా వ్యాక్సిన్ పై ఏ వార్త వచ్చినా చదివేలా చేస్తోంది. ఇంతకీ ఇప్పుడు అక్కడ కరోనాకి వ్యాక్సిన్లు వచ్చినాయి అన్న వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది మరి వివరాలేంటో ఏపీహెరాల్డ్ ఆర్టికల్ పై ఓ లుక్ వేయండి.  

గత నాలుగు నెలలుగా చైనాకు మనకు సరిహద్దు ప్రాంతాల్లో యుద్దవాతావరణం నెలకొన్న విషయం విదితమే.  ఇప్పుడు కరోనా నుండి బయటపడడానికి చైనా ‘అత్యవసర’ వినియోగానికి తలుపులు తెరిచింది. కరోనా వైరస్ పై పోరాటం చేస్తున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీల సిబ్బంది, సైనికులు, పోలీసులు, కస్టమ్స్‌, సూపర్‌ మార్కెట్ల సిబ్బంది, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు వంటివారికి ‘అత్యవసర’ వ్యాక్సిన్లు వేస్తోంది. దీంతో వారి ఆరోగ్య భద్రత ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారుతోంది. ‘అత్యవసర’ వ్యాక్సిన్‌ వేయించుకొని లక్షలాది మందికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నా చైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. పైగా అత్యవసర వ్యాక్సిన్‌వల్ల తలెత్తే దుష్ప్రభావాల గురించి ఎవరికీ చెప్పొద్దంటూ వ్యాక్సినేషన్‌ సమయంలోనే వారితో ‘నాన్‌ డిస్‌క్లోజర్‌’ ఒప్పందాలపై సంతకాలు చేయించుకుంటున్నట్లు తెలుస్తోంది.

అత్యవసర వ్యాక్సిన్‌ అనర్ధాలు సృష్టిస్తోందని తెలిసినా చైనాలోని కంపెనీల ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరించే సాహసం చేయలేక పోతున్నారని పరిశీలకులు అంటున్నారు. సినోఫార్మ్‌, సినోవ్యాక్‌ కంపెనీలు అభివృద్ధి చేసిన ప్రయోగాత్మక కొవిడ్‌ వ్యాక్సిన్లను అత్యవసర ప్రాతిపదికన లక్షలాది మందికి అందించారని సమాచారం. వీటిని చైనా హెల్త్‌ కమిషన్‌ కొట్టి పారేస్తోంది. మరి ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పుట్టుకకు కారణమయిన చైనా మరో విధంగా అత్యవసర వ్యాక్సిన్ రూపంలో ప్రజలప్రాణాలతో చెలగాటమాడుతోందని అందరూ దూషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: