పీఎం కేర్స్ ఫండ్ ... ఆర్టికల్ 266 కు వ్యతిరేకం... లోక్ సభలో రచ్చ రచ్చ...??

VAMSI
ఈ సంవత్సరం కరోనా కారణంగా మన ఆర్ధిక పురోగతి బాగా తగ్గిపోయింది. దేశంలో ఎప్పుడైనా ఇటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్ధికంగా ఉపయోగపడడానికి కేంద్ర ప్రభుత్వం ఒక సహాయనిధి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పీఎం కేర్స్ ఫండ్ ను మార్చ్ నెల 28 వతేదీన ఏర్పాటుచేయడం జరిగింది. ఈ నిధికి ఎంతోమంది ప్రముఖులు మరియు సామాన్యులు విరాళాలను ఇస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ అంశంపై లోక్ సభ లో తీవ్ర చర్చకు తెరలేపింది. ఈ పీఎం కేర్స్ ఏర్పాటును విపక్షాలకు చెందిన సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. నిన్న జరిగిన లోక్ సభ లో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్నులు, ఇత‌ర చ‌ట్టాల స‌డ‌లింపు, స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బిల్లులపై విపక్షాలు వారి అభిప్రాయాలను తెలియచేసారు.  ఈ బిల్లును వ్యతిరేకించిన వారిలో ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్‌, ఏఎం ఆరిఫ్‌, అధిర్ రంజ‌న్ చౌద‌రీలు ఉండడం విశేషం. అంతేకాకుండా పీఎం  కేర్స్ సహాయనిధి ఆర్టిక‌ల్ 266కు పూర్తి వ్యతిరేకమని అధిర్ రంజన్ ప్రశ్నను లేవనెత్తారు.  


దీనిలో ముఖ్యంగా కోవిడ్‌19 నేప‌థ్యంలో ప‌న్నుల చెల్లింపు గ‌డువును పొడిగిస్తూ ట్యాక్సేష‌న్‌ బిల్లును తీసుకువ‌చ్చారు.  పీఎం జాతీయ రిలీఫ్ ఫండ్‌కు ఉన్న మిన‌హాయింపులే పీఎం కేర్స్ ఫండ్‌కు వ‌ర్తిస్తాయని బిల్లులో పేర్కొన్నారు.  ఈ విషయంలోనే విపక్ష పార్టీ సభ్యులు వ్యతిరేకించడం జరిగింది. దేశంలో ఎన్నో సార్లు చాలా విపత్తులు జరిగాయి కానీ ఇలాంటి సమయంలోనే పీఎం  కేర్స్ నిధిని ఏర్పాటు చేయ‌డానికి కార‌ణం ఏంట‌ని ప్ర‌శ్నించారు. మీరు చెబుతున్న విధముగా పీఎం కేర్స్ ప్రజల కోసమే ఏర్పాటుచేయబడిన నిధి అయితే, కాగ్ ఎందుకు ఆడిట్ చేయడం లేదని ఆరోపించారు.తరువాత టీఎంసీ నేత సౌగ‌త్ రాయ్ దేనిపై మాట్లాడుతూ పీఎం  కేర్స్ ఫండ్ ని కూడా నేషనల్ రిలీఫ్ ఫండ్ లో నే విలీనం చేయాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ మ‌నీష్ తివారీ పీఎం కేర్స్ ఫండ్ కి ఉన్న ప్రత్యేక అధికారాలను త‌ప్పుప‌ట్టారు.


పీఎం కేర్స్ నిధి విష‌యంలో బీజేపీ, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య మాట‌ల ఘ‌ర్ష‌ణ కొన‌సాగింది. విప‌క్ష స‌భ్యుల ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఈయన విపక్షాల వాదనలను తెలీగా కొట్టిపారేశారు. ఆల్రెడీ పీఎం కేర్స్‌ ఫండ్ పై ఉన్న కేసులన్నింటినీ న్యాయస్తాహనాలు కొట్టిపారేశాయ‌న్నారు. మీరు వాదిస్తున్న విధంగా పీఎం కేర్స్ ఫండ్‌ వచ్చే విరాళాలు ఏవీ కూడా ప్ర‌భుత్వం ఖాతాలోకి వెళ్ల‌వ‌న్నారు. ఇదే సమయంలో ఆయన పీఎంఎన్ఆర్ఎఫ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.  అంతే కాకుండా గాంధీ కుటుంబమైనా తీవ్రస్థాయిలో రెచ్చిపోయి మాట్లాడారు.  దీనికి అధిర్ రంజన్ కౌంటర్ ఇస్తూ పీఎం కేర్స్ ఫండ్ చైనా కంపెనీలనుండి నిధులు తీసుకోవడం మాకు తెలియదంటారా. ఈ విషయం పై దర్యాప్తు చేపట్టాలన్నారు.  దీనికి ప్రతిగా అనురాగ్ ఠాకూర్ నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్‌ను గాంధీ కుటుంబం అక్ర‌మంగా వాడుకున్నారని చెప్పారు.  ఈ సంద‌ర్భంలో ఠాకూర్ మాట్లాడుతూ పీఎం నేష‌న‌ల్ రిలీఫ్ ఫండ్ వ‌ల్ల ఎవ‌రు బెనిఫిట్ పొందారో బ‌య‌ట‌పెడుతామ‌ని అన్నారు. సమస్య అంతకంతకూ పెరుగుతూ ఉండడంతో స్పీకర్ కలుగజేసుకుని ఇరుపక్షాల వారిని శాంతిపచేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: