ఇంటి నుండే పని చేస్తున్నారా.. ఇది మీకోసమే..?

praveen
ప్రస్తుతం కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న  నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వర్క్ ఫ్రమ్  హోమ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంతో మంది  ఇంట్లో గంటలకు తరబడి కూర్చుని తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఉన్నారు. ఆఫీసులో అయితే స్నేహితులతో సరదాగా మాట్లాడటం.. అటు ఇటు తిరగడం లాంటివి చేస్తూ ఉంటారు కానీ. ఇంట్లో వాతావరణం పూర్తిగా ఆఫీస్ వాతావరణానికి విరుద్దంగా ఉంటుంది.  కాబట్టి  ఇంట్లో ఎంతో ప్రెషర్  మధ్య వర్క్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారు కాస్త ఉపశమనం కోసం కొన్ని రకాల పనులు చేస్తే మంచిది అని నిపుణులు చెబుతున్నారు.



 కనీసం అరగంటకు ఒకసారి లేచి  నిలబడితే రక్తప్రసరణ సక్రమంగా సక్రమంగా జరుగుతుందని  నిపుణులు చెబుతున్నారు.  తద్వారా తొందరగా అలసిపోకుండా ఉంటారట.



అంతేకాదు గంటల తరబడి కూర్చుని పనిచేయడం వల్ల కాళ్లు  కూడా పట్టే అవకాశం ఉందని  తద్వారా ఒత్తిడి పెరిగి ఓపిక  కూడా నశించిపోతుందని చెబుతున్నారు నిపుణులు. మధ్యలో చిన్నపాటి వ్యాయామం లాంటిది చేయడం లాంటివి చేస్తే కాస్త ఉపశమనం కలిగే... సరికొత్త ఉత్సాహం  వస్తుందని చెబుతున్నారు.



 ఇంటి దగ్గర గంటల తరబడి కదలకుండా కూర్చోవడం వల్ల ఎంతోమంది నడుము  పట్టేసి ఆస్కారం కూడా ఉంటుంది. తద్వారా నడుము నొప్పి వేధిస్తూ పనిచేయడం కష్టంగా మారుతుంది. అందుకే పని చేసేటప్పుడు గోడకు దగ్గరగా కుర్చీ వేసుకుని దానికి కొంత నడుము వంచి  సేదతీరుతున్నట్లు  కూర్చుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.



 గంటలకొద్దీ కూర్చుని కంప్యూటర్ చూడడం వల్ల కూడా ఎంతో మందికి మెడనొప్పి వచ్చే అవకాశం ఉందని...తద్వారా వివిధ రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే గంటకు ఒకసారి బోర్లా పడుకుని రెండు చేతులను నేలకు ఆనించి కిందికి పైకి లేవాలి. తద్వారా... మెడ భాగంలో రక్త ప్రసరణ సజావుగా జరుగుతుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: