కాంగ్రెస్ లో ఈ వర్గపోరు దేనికి సంకేతం..?

P.Nishanth Kumar
యువతరం వర్సెస్ వృద్ధ తరం.. ప్రతి రంగంలో నూ ఈ రెండు ఆ రంగం యొక్క భవిష్యత్ లో కీలక పాత్ర పోషిస్తాయి.. ఎంతో అనుభవజ్ఞులైన వృద్ధులు చెప్పిన బాటలో యువతరం నడిస్తే ఎంతో సత్ఫలితాలు వస్తాయి అన్నది అందరికి తెలిసిన నిజం.. కానీ యువతరానికి దూకుడు ఎక్కువ.. వారి మాట ఎప్పుడు వినరు.. చేతులు కాలితే తప్పా ఆకులు పట్టుకోవాలనే ధ్యాస ఉండదు.. దీన్ని రాజకీయాల్లోకి అన్వయిస్తే కాంగ్రెస్ పార్టీ కి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే జాతీయ కాంగ్రెస్ పార్టీ వర్గపోరు ఎలా ఉందో అందరికి తెలిసిందే.. జూనియర్ లు , సీనియర్ లకు మధ్య తేడా , భేదాపిప్రాయాలు చాలానే ఉన్నాయి..పార్టీ లో యువతరం ఎక్కువ దూకుడు గా ఉంటూ వృద్ధ తరాన్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపణలు వస్తున్నాయి..ఇరు వర్గాల్లో ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలన్న ఆకాంక్ష ఇప్పుడు కాంగ్రెస్ ని ఈ దారుణమైన స్థితి కి తెచ్చిందన్న భావన ఉన్నా పార్టీ లో నాయకులూ ఇంకా అది గమనించకుండా ఉండడం గమనార్హం..

ఎంతలేదన్నా రాహుల్ గాంధీ భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ కి వారసుడు, ప్రధాన మంత్రి.. అందుకు తగ్గట్లే రాహుల్ గాంధీ కూడా వ్యవహరిస్తున్నారు. అయితే అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది.. కుటుంబం మొత్తం రాజకీయ నేపథ్యంలోనే ఉన్నా రాహుల్ గాంధీ ఎక్కువగా విదేశాల్లోనే పెరిగారు.. ఎప్పుడైతే సోనియా గాంధీ రాజకీయాల్లో బలహీలమైపోతున్నారని తెలిసిందో అప్పుడే పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చారు.. అప్పటినుంచి పార్టీ లో భేదాలు మొదలయ్యాయని అన్న అభిప్రాయాలూ లేకపోలేదు.. రాహుల్ గాంధీ యువ రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ ముందుకు పోతుండగా ఆ సమయంలో సీనియర్ లను పట్టించుకోవడం లేదని వాదన బయటకి వచ్చింది..

దాంతో పార్టీ భేదాపిప్రాయాలు మొదలయ్యాయి.. వాటికి వర్గపోరు తోడై పార్టీ ని దిగజారిపోయేలా చేసింది... ఇది బహిరంగంగా కూడా తేటతెల్లమైపోయాయి.. సీనియర్ నాయకులూ లేఖలు రాసి, సోషల్ మీడియా లో పోస్ట్లు పెట్టి పార్టీ లో భేదాపిప్రాయాలు ఉన్నాయని ప్రపంచానికి తెలియజేసేలా చేయగా రాహుల్ గాంధీ వాటిని తిప్పుకొడుతూ ఇద్దరు కలిసి ఏళ్ల చరిత్ర పార్టీ పరువును గంగంలో కలిపేశారు... పార్టీ లో పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈ తల్లీకొడుకులను కూడా చెరోవర్గానికి నాయకత్వం వహించాల్సిన పరిస్థితులను సృష్టించినట్లయింది. ఏదేమైనా రాహుల్ గాంధీ కి అందరికి కలుపుకోవాల్సిన బాధ్యత ఉన్న నేపథ్యంలో భవిష్యత్ లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: