తన ప్రియుడిపై యాసిడ్ పోయడానికి కారణం ఇదేనా...?

Suma Kallamadi
మరో దారుణం వెలుగు లోకి వచ్చింది. చిన్న చిన్న తగాదాలతో, మనస్పర్ధాల తో....  కొట్టుకోవడం, చంపుకోవడం ఇటీవల కాలం లో పెరిగి పోతున్నాయి.  అటువంటి సంఘటనే మరొకటి జరిగింది. దీని వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి.... ప్రియురాలిని కాదని మరొక అమ్మాయిని వివాహం చేసుకోవడానికి సిద్ధం అయ్యాడని ఆగ్రహం తో  ప్రియుడి పై యాసిడ్‌ దాడి చేయడం జరిగింది . ఇది జిల్లా లోని నంద్యాల మండలంలో గురువారం చోటు చేసుకోవడం జరిగింది.

వివరాల విషయం లోకి వెళితే పోలీసులు ఇలా అన్నారు...... నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన నాగేంద్ర, సుప్రియ గత మూడు సంవత్సరాలుగా ప్రేమ లో ఉన్నారు. వీరిద్దరికి కూడా ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. కానీ వీరి ఇద్దరి కులాలు వేరని , ప్రేమ పెళ్లికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని నాగేంద్ర తన ప్రియురాలు ప్రేమకు బ్రేకప్‌ చెప్పాడు.

బ్రేకప్ అయ్యి పోయిన తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ప్రియుడి వివాహనాన్ని తాను భరించలేక  అతడి పై యాసిడ్‌ దాడి చేసింది. దీనితో  నాగేంద్ర ముఖం , చెయ్యి బాగా కాలి పోయింది. వెంటనే అతనిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు నాగేంద్ర. అయితే తనను మోసం చేసింది మాత్రమే కాక తిరిగి ఆమె తో తాను ప్రేమగా ఉండాలని వేధించడం కారణం గానే సుప్రియ ఈ యాసిడ్ దాడికి పాల్పడినట్టు చెప్పింది. ఆమెని మోసం చెయ్యడం అలానే  కులం పేరు తో అడ్డు చెప్పి మరో యువతిని పెళ్లి చేసుకొని మళ్ళీ ఇప్పుడు ప్రేమ పేరు తో వేధిస్తుంటే తట్టుకో లేక ఇలా చేశానని ఆమె తెలిపారు. కానీ నిజంగా ఇది దారుణమే. మోసం చెయ్యడం తో పాటు ప్రేమగా ఉండాలని అంటే ఎక్కడ కుదురుతుంది .  

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: