తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్..!

frame తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్..!

praveen
తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తాజాగా గుడ్ న్యూస్ అందింది. ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభం అయ్యాయి. గతంలో లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ప్రైవేటు రోడ్డు రవాణా సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలకు అనుమతి లభించినప్పటికీ బస్సు సర్వీసులు మాత్రం ప్రజలకు అందుబాటులోకి రాలేదు. దీంతో ఎంతో మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో అన్లాక్ 4.0 కొనసాగుతున్న తరుణంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు ఐదు నెలల తరువాత ప్రైవేటు బస్సులు రోడ్డెక్కాయి .



 రవాణా శాఖ అధికారుల అనుమతితో ప్రైవేట్ బస్సులన్నీ ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రారంభమయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ... తెలంగాణ నుంచి ఆంధ్ర ప్రదేశ్ బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతూ ప్రయాణించిన ఎంతో మంది ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. ఏకంగా 150 ప్రైవేటు బస్సులకు గాను ఆన్లైన్ ద్వారా టికెట్ రిజర్వేషన్ విధానాన్ని ప్రైవేట్ ఆపరేటర్లు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక రాబోయే రోజుల్లో పరిస్థితిని బట్టి మరిన్ని సర్వీసులను పెంచేందుకు కూడా ప్రైవేట్ ట్రావెల్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.




 అయితే ఏపీ తెలంగాణ మధ్య ఆర్టీసీ బస్సులు తిప్పేందుకు అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకునేందుకు ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసినప్పటికీ దానిపై తెలంగాణ సర్కారు స్పందించలేదు. దీంతో ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం అవుతాయా లేదా అన్నది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే మారిపోయింది. కాగా  ప్రస్తుతం ప్రారంభమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కూడా కరోనా నిబంధనలు పాటిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ప్రయాణికుడు మాస్కు,  శానిటైజర్ భౌతిక దూరం పాటించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: