మహారాష్ట్ర పోలీసులను వదలని కరోనా..24 గంటల్లోనే..

Satvika
ప్రపంచాన్ని మొత్తాన్ని ఒకే నినాదం మీదకు తీసుకొచ్చిన మాట కరోనా..కంటికి కనిపించన ఈ వైరస్ కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రతి ఒక్కరినీ ముప్పుతిప్పలు పెట్టింది.చైనా నుంచి ప్రపంచమంతా వ్యాపించిన ఈ కరోనా కారణంగా ప్రభావం తో యావత్ దేశాలు సర్వసాన్ని కోల్పోయాయి.ఆర్దికంగా నష్ట పోయి రోడ్డు మీదకు పడవేసింది.ఇకపోతే అన్నీ దేశాలు ఇప్పటికీ కరోనా ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ ఎటువంటి ప్రయోజనం లేదు.


మన దేశం విషయానికొస్తే.. కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.. క్వారంటైన్ సెంటర్లో కరోనా రోగులు ఉన్నా కూడా వైరస్ వ్యాప్తి తీవ్ర రూపాన్ని చూపిస్తుంది..రోజులో దాదాపు చాలా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా ప్రభావం కాస్త ఎక్కువగా ఉందని చెప్పాలి.అలాగే కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య కూడా ఎక్కువే..


ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కరోనా ప్రభావం కాస్త ఎక్కువగా ఉంటుంది..రోజులో దాదాపు 11 వేల కేసులకు పైనే నమోదు అవుతున్నాయి.కరోనా చెకప్ టెస్టుల నిర్వహిస్తున్న కూడా కరోనా ఉగ్ర రూపం దాల్చుతుంది.నిన్నటి వరకు కరోనా మరణాలు 4000 లకు పైగా చేరగా ఈరోజు కూడా పాజిటివ్ కేసులతో పాటుగా మరణాలు కూడా ఎక్కువగా సంభవించాయి. ప్రస్తుతం ఏపి లో భారీ వర్షాలు ముంచెస్తున్నాయి..ఇది ఇలా ఉండగా శాంతి భద్రతలకు ఎటువంటి భంగం కలిగించకుండా చూసుకుంటూ అహర్నిశలు ప్రజల శ్రేయస్సు కోసం కష్టపడుతున్న పోలీసులకు కరోనా సోకడంతో ప్రాణాలను కోల్పోతున్నారు.


మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 424 మంది పోలీసు సిబ్బంది కరోనా బారినపడగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర పోలీసు శాఖ గురువారం ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు మొత్తం 16,015 మంది సిబ్బందికి కోవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ కాగా 11,688 మంది చికిత్సకు కోలుకున్నారు. 2,838 మంది ప్రత్యేక ప్రాంతాల్లో ఉండి చికిత్స ను అందుకుంటున్నారు.తీవ్రమైన ఇన్ఫెక్షన్ తో తాజాగా 139 మంది మృత్యు వాతపడ్డారు.ఇకపోతే కరోనా  నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి మొత్తం రూ .23.71 లక్షల జరిమానా వసూలు చేశారు. సుమారు 2.47 లక్షల కేసులు నమోదయ్యాయి. 96,121 వాహనాలను సీజ్‌ చేసి 34,361 మందిని అరెస్టు చేసినట్లు మహారాష్ట్ర పోలీస్ శాఖ తాజా బులిటెన్ లో వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: