ఒకే పోలికలు.. అన్న ప్లేస్ లో తమ్ముడు వెళ్ళాడు.. కానీ చివరిలో ఊహించని ట్విస్ట్..?
అయితే ఇటీవలే ఈ అన్నదమ్ముల బాగోతం మొత్తం విజిలెన్స్ అధికారుల విచారణలో బయట పడింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లో జరిగింది ఈ ఘటన . వివరాల్లోకి వెళితే... చంద్రశేఖర్ నగర్ కు చెందిన గాదె రామదాసు రవీందర్ అన్నదమ్ములు. ఇద్దరు కవలలు. అంతే కాదు అచ్చుగుద్దినట్టుగా ఒకే పోలికలతో ఉన్నారు. 12 ఏళ్ల క్రితం గాదె రామదాసుకు టిఎస్ఎన్డిపిడిసిఎల్ లో జూనియర్ లైన్మెన్ గా ఉద్యోగం వచ్చింది. అయితే అన్నదమ్ములు ఇద్దరూ ఒకే పోలికలతో ఉండటంతో అన్న స్థానంలో తమ్ముడు రవీందర్ ఉద్యోగంలో చేరాడు. అంతేకాదు ఆ తర్వాత పదోన్నతులు కూడా సాధించాడు. జూనియర్ లైన్మెన్ నుంచి ఆ తర్వాత క్రమక్రమంగా లైన్ మెన్ గా పదోన్నతి పొందాడు.
అయితే ఇటీవలే ఈ అన్నదమ్ములు వ్యవహరిస్తున్న విషయం పై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు రావడంతో... విచారణ జరిపారు అధికారులు. విజిలెన్స్ అధికారుల విచారణలో బయటికి వచ్చిన నిజాలతో అధికారులు సైతం అవాక్కయ్యారు. అన్న రామదాసు పేరుతో తమ్ముడు రవీందర్ ఉద్యోగం చేస్తున్నట్లు విచారణలో తేలడం తో... రవీందర్ ను ఉద్యోగం నుంచి తొలగించారు అధికారులు . ఆ తర్వాత పోలీసులు గాదె రవీందర్ పై చీటింగ్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.