బండి సంజయ్ కుమార్ జర్నీ ...సరస్వతి శిశుమందిర్ TO బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఇలా చాలా చిన్న స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ 2005 లో ఏర్పడిన కరీంనగర్ నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో పోటీచేసి 48వ డివిజన్ నుండి బీజేపీ కార్పొరేటర్ గా గెలుపొందారు మరియు రెండు సార్లు కరీంనగర్ నగరానికి బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అనంతరం భారతీయ జనతా పార్టీ కేరళ,తమిళనాడు రాష్ట్రాలకు ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహించాడు. బండి సంజయ్ 2014 సాధారణ ఎన్నికలలో కరీంనగర్ శాశన సభ్యునిగా బీజేపీ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు, తర్వాత జరిగిన ముందస్తు ఎన్నికలలో కూడా తన సమీప అభ్యర్థి గంగుల కమలాకర్ టి ఆర్ ఎస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.
2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కరీంనగర్ నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసి టి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి టి వినోద్ కుమార్ పై 87 వేల ఓట్లకుపైగా మెజారిటీతో గెలిచారు. తర్వాత అయన కృషికి, పట్టుదలకు బీజేపీ అధిష్టానం మెచ్చి 2020 మార్చి 11 న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమించింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తనకన్నా సీనియర్ నాయకులు, గొప్ప నాయకులు ఉన్నా కూడా అధ్యక్ష పదవి తనని వరించిందంటే, అతని ప్రతిభా పాటవాలు, పార్టీ పై ఉన్న గౌరవం, అకుంఠిత దీక్ష కారణాలుగా చెప్పుకోవచ్చు.
ఇప్పుడు దేశమంతా బండి సంజయ్ పేరు మారుమోగుతోంది. తన నాయకత్వ లక్షణాలతో తెలంగాణ లో బీజేపీ ని అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాడు. ఎలాగైనా వచ్చే ఎన్నికలలో బీజేపీ ని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడే ప్రతి ఒక్క విషయాన్ని మరియు అంశాన్ని వాడుకుంటూ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నాడు.