ఓపెన్ అయిన సోము వీర్రాజు.... పవన్ ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కానున్నారా?
సోము వీర్రాజు అధ్యక్షుడు గా ఎన్నికైన తర్వాత చిరంజీవి ని కలవడం, జనసేన అధ్యక్షుడు పవన్ తో భేటీలు జరపడం చూస్తుంటే దీని వెనక ఏదో పెద్ద వ్యూహమే ఉంది అనుకుంటూ.... గుసగుసలాడుతున్నాయి రాజకీయ వర్గాలు.అయితే ఈ విషయంపై బహిరంగంగానే స్పందించారు సోము వీర్రాజు. 2024 ఎన్నికల లక్ష్యంగానే పార్టీని మరింత దృఢంగా చేసేందుకే ప్రముఖులను కలుస్తున్నాం..! అంటూ తాజాగా ప్రకటించారు సోము. ఆసక్తికరమైన కామెంట్స్ తో రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచారు సోము వీర్రాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పదవి కోసం ఏనాడూ పాకులాడలేదు.... నాకు ఈ పదవి కావాలని అడిగే వ్యక్తి కాదు.
కానీ ప్రజల సంక్షేమం కోరే పవన్ వారి క్షేమమే తన బాధ్యతగా భావిస్తూ కార్యాలను చేసుకు పోతుంటారు. అంతేకాదు వారి మేధస్సు అమోఘం, ప్రధాని మోడీ గారి ఆలోచనలు ఎలా ఉంటాయో జనసేన అధినేత పవన్ ఆలోచనలు కూడా సరిగ్గా అదే విధంగా ఉంటాయి. మోడీ ఇజం - పవనిజం రెండింటినీ కలిపి స్ట్రాంగ్ ఫోర్స్ గా తయారు చేయబోతున్నాం. ఆయనతో కలిసి దేశ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇందులో రెండో ఆలోచన లేదు. ఇప్పుడు ఆయనకు కేంద్రంలో కీలకమైన బాధ్యతలు ఇచ్చి ఆ తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అనేది మా ఎజెండా లో ఉన్న అంశమా..? అన్నది మీ ప్రశ్న అయితే....... రాజకీయ పరంగా మా వ్యూహాలు ఎన్నో ఉంటాయి అన్నింటినీ ఇప్పుడే ప్రకటించలేము. సమయం వస్తే తప్పక చెప్తాం.. పెద్దలంతా కూర్చొని ఏం చేయాలో అదే నిర్ణయిస్తారు. ఒకవేళ పార్టీ పవన్ ను ముఖ్యమంత్రి అభ్యర్థి అని డిసైడ్ చేస్తే దానికనుగుణంగానే ముందుకు తీసుకెళ్తాం.
క్రికెట్ లో ఏది సిక్స్ ఏది ఫోరో కొడితే కానీ తెలియదు, మా పాలిటిక్స్ కూడా అంతే..... ఇది కూడా ఒక రకమైన క్రికెట్టే... భారతీయ జనతా పార్టీకి ఒక శాతం మాత్రమే ఓటు బ్యాంకు ఉందని అంటున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో రెపరెపలాడే జెండా తో అధికారంలోకి రాబోతున్న భారతీయ జనతా పార్టీ మరియు జనసేన పార్టీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు సోము వీర్రాజు... ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చూస్తుంటే పవన్, చిరంజీవి లతో ఆల్రెడీ ఈ అంశాలపై చర్చలు జరిపి ఒక వ్యూహాన్ని రచించినట్లు చెప్పకనే చెబుతున్నారు ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.