ఒక విధంగా ఆవేదన.. ఒక విధంగా ఊరట..!

NAGARJUNA NAKKA
మన దేశంలో కరోనా ఉగ్రరూపం ప్రదర్శిస్తూనే ఉంది. ఏ మాత్రం తగ్గకుండా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోతోంది. లక్షలాది మందిని ఆస్పత్రిపాలు చేసిన ఈ మహమ్మారి.. వేలాది ప్రాణాలను హరించేసింది. భారత్ లో కొత్తగా 60 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న దేశాల్లో... అమెరికా, బ్రెజిల్ తర్వాత మన దేశం మూడో స్థానంలో కొనసాగుతోంది. కొత్త కేసుల నమోదులో... ఇండియా అగ్ర స్థానంలో కొనసాగుతోంది. అయితే రికవరీ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండటం కాస్త ఊరటనిచ్చే విషయం.  
ఇండియాపై కరోనా పగబట్టినట్టుగానే ఉంది. కొత్తగా 60 వేల 975 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 31 లక్షల 67 వేలు దాటిపోయింది. కొత్తగా 848 మంది చనిపోవడం ఆవేదన కలిగించే విషయం. మొత్తం మరణాల సంఖ్య 58 వేల 390కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.8 శాతంగా ఉండగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 7 లక్షల 4 వేల 348కి చేరింది.
గత 24 గంటల్లో  దేశంలో 66 వేల 550 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకున్నారు. అంటే... పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇది కాస్త ఊరటనిచ్చే విషయమే.  రికవరీ రేటు దేశంలో మరింత పెరిగి 75.9 శాతానికి  చేరింది. గడిచిన 24 గంటల్లో 9 లక్షల 25 వేల మందికి టెస్టులు చేశారు. ఇప్పటి వరకు మొత్తం  3 కోట్ల 68 లక్షల మందికి టెస్టులు నిర్వహించారు.  
మహారాష్ట్రలో రికవరీలో కేసుల సంఖ్య 5 లక్షలు దాటాయి. కొత్త కేసులు 11వేలు రాగా... రికవరీలు 14 వేలకు పైగా వచ్చాయి. 19 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్‌లో యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి.  
మొత్తం మరణాల్లో... అమెరికా, బ్రెజిల్, మెక్సికో తర్వాత ఇండియా నాలుగో దశలో ఉంది. రోజువారీ మరణాల్లో భారత్ మళ్లీ మొదటి స్థానానికి చేరింది. ఆ తర్వాత బ్రెజిల్, అమెరికా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: