సెప్టెంబర్ 1 నుండి లాక్ డౌన్ ఉండదా....? కరోనాతో సహజీవనం చేయాల్సిందేనా...?
అన్ లాక్ సడలింపుల్లో భాగంగా కేంద్రం ఇప్పటికే అనేక అనుమతులు ఇచ్చింది. గత కొన్ని రోజులుగా అన్ లాక్ 4.0 సడలింపుల్లో కేంద్రం వేటికి అనుమతులు ఇవ్వబోతుందనే చర్చ జరుగుతోంది. అయితే కేంద్రం సెప్టెంబర్ 1 నుంచి లాక్ డౌన్ ఆంక్షలన్నీ ఎత్తివేయాలని యోచిస్తున్నట్టు సమాచారం అందుతోంది. కేంద్రం లాక్ డౌన్ ఆంక్షలన్నీ ఎత్తివేస్తే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల కంటే ఎక్కువ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
అయితే దేశంలో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కేసులు నమోదవుతున్నా రికవరీ రేటు కూడా భారీగా ఉండటం వల్లే కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను ఎత్తివేసినా నూతన మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశాలు ఐతే ఉన్నాయి. పరిశ్రమల్లో కార్మికుల రక్షణ యాజమాన్యాలదే అనే విధంగా కేంద్రం కార్మిక చట్టాల్లో మార్పులు తెచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
కరోనా నిర్ధారణ అయిన వారికి చికిత్స అందించే విషయంలో మాత్రం కేంద్రం మరిన్ని ఏర్పాట్లు చేయనుందని సమాచారం. కొన్ని కీలక విషయాలకు సంబంధించి స్థానిక పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలకే ఫైనల్ నిర్ణయం వదిలేసే అవకాశం కేంద్రం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. భారత్ లో కరోనా రికవరీ రేటు 75 శాతం దాటింది. కేంద్రం అన్ కాల్ నిబంధనలు ఎత్తివేస్తే దేశవ్యాప్తంగా వ్యాపార వాణిజ్యాలకు సంబంధించిన విషయాల్లో సాధారణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. కేంద్రం ఇదే విధంగా ముందడుగులు వేస్తే ఐదు నెలల నుంచి అమలవుతున్న నిబంధనలు వారం రోజుల్లో పూర్తిగా తొలగిపోతాయి.