దారుణం : నాలుగేళ్ళ కూతురికి ఉరి వేసిన తండ్రి.. అంతటితో ఆగకుండా..?
క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్న ఓ వ్యక్తి భార్య కూతుర్ని అతి దారుణంగా ఉరివేసి హత్య చేశాడు. ఈ ఘటనతో స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వచ్చింది, వివరాల్లోకి వెళితే... ఎర్రగొండపాలెం లోని అంబేద్కర్ నగర్లో దూదేకుల హుస్సేన్ కు రేష్మ అనే యువతితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది, వీరికి నాలుగేళ్ల సమీరా అనే కూతురు కూడా ఉంది. అయితే కొన్నాళ్ల వరకూ ఎంతో అన్యోన్యంగా సాగిపోయిన వీరి దాంపత్య జీవితంలో హుస్సేన్ చెడు అలవాట్లు చిచ్చు పెట్టాయి, చెడు వ్యసనాలకు బానిస గా మారిపోయిన హుస్సేన్ భార్య కూతురు ని పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు.
మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యను చిత్రహింసలకు గురి చేసే వాడు హుస్సేన్. అంతేకాకుండా ఇతరులతో భార్యకు అక్రమ సంబంధాలు అంటగడుతూ సూటిపోటి మాటలతో వేధింపులకు దిగేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి మధ్యం మత్తులో ఇంటికి వచ్చిన హుస్సేన్ మరోసారి భార్య రేష్మ తో గొడవ పడ్డాడు, ఈ క్రమంలోనే మాటా మాటా పెరిగి తీవ్ర కోపోద్రిక్తుడైన హుస్సేన్ భార్య రేష్మ తోపాటు కూతురు సమీరా ను అతి దారుణంగా కొట్టాడు, అనంతరం ఇద్దరి మెడకి తాడు బిగించి చంపేశాడు హుస్సేన్, ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు, వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని... దర్యాప్తు చేస్తున్నారు