పవన్ కల్యాణ్ అభిమాని ప్రాణాలు కాపాడిన సీఎం జగన్ ?
అవసరమైన సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. అతనికి అత్యవసరం గా చికిత్స చేయించకపోతే ప్రాణాలకే ప్రమాదం అని ఇప్పటికే వైద్యులు తేల్చి చెప్పారు. అతని దయనీయ పరిస్థితిని.. అతనికి అత్యవసర చికిత్స చేయాల్సిన అవసరం గురించి ఓ స్వచ్ఛంద సంస్థ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టింది. అది కాస్తా వైరల్ అయ్యింది. ఆనోటా ఈ నోటా.. ఆగ్రూపు.. ఈ గ్రూపు.. తిరుగుతూ ఆ పోస్టింగ్ పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబుకు చేరింది.
పవన్ కల్యాణ్ అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధి గురించి తెలుసుకుని ఆయన చలించి పోయారు. నాగేంద్రకు సాయం చేయాలని భావించారు. ఆయన మొత్తం మీద ఈ విషయాన్ని సీఎం జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఎం జగన్ పవన్ అభిమానికి రూ.10లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ ఆస్పత్రికి ఎల్వోసీ అందజేశారు.
అవసరమైన ధన సాయం అందడంతో పవన్ అభిమాని నాగేంద్రకు వైద్యులు వైద్యం ప్రారంభించారు. ప్రభుత్వ సాయంతో పవన్ అభిమాని నాగేంద్రకు స్టెమ్ సెల్ థెరపి నిర్వహించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ అభిమాని నాగేంద్ర ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ విషయాన్ని ఏపీ సీఎంవో అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. సీఎం సాయం పట్ల నాగేంద్ర కుటుంబం కూడా సంతోషం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి సకాలంలో స్పందించి నాగేంద్ర ప్రాణాలు కాపాడారని వారు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నారు.