కరోనా వైరస్ గురించి వెలుగులోకి మరో చేదు నిజం...?

Reddy P Rajasekhar
కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తల పరిశోధనల్లో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. వైరస్ గురించి వెలుగులోకి వస్తున్న విషయాలు ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి. వ్యాక్సిన్ వచ్చే లోపు ఈ వైరస్ బారిన పడి ఇంకా ఎంతమంది మరణిస్తారో అనే అని శాస్త్రవేత్తలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైరస్ గురించి మరో చేదు నిజం వెలుగులోకి వస్తోంది.
 
దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు లక్షణాలు లేని వాళ్ల నుంచి వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు తేలిందని చెప్పారు. కరోనా సోకిన వారిలో కొందరికి లక్షణాలు కనిపించపోవటాన్ని ప్రీసింప్టామెటిక్‌ ఫేస్‌ అంటారని చెప్పారు. లక్షణాలు ఉన్నవాళ్లతో సమానంగా లక్షణాలు లేనివాళ్లు వైరస్‌ను కలిగి ఉంటారని శాస్త్రవేత్తలు చెప్పారు. బుచెయోన్‌ సూన్‌చున్‌హ్యాంగ్ విశ్వవిద్యాలయంకు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.
 
303 మంది లక్షణాలున్న, లేని కరోనా రోగులపై అధ్యయనం వీరిలో వైరస్ లోడ్ ఏ స్థాయిలో ఉందో గుర్తించారు. అధ్యయనం చేసిన రోగుల్లో 110 మంది లక్షణాలు లేని రోగులు. వీళ్లలో 21 మందికి మాత్రమే తర్వాత కాలంలో లక్షణాలు బయట పడ్డాయని చెప్పారు. 29 శాతం రోగులకు అసలు లక్షణాలే బయటపడలేదని తేల్చారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలెర్జీ అడ్‌ ఇన్ఫెక్సియస్‌ డిసీజెస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఆంథోనీ ఫౌసీ 20 నుంచి 45 శాతం మంది రోగుల్లో కరోనా లక్షణాలు కనిపించడం లేదని పేర్కొన్నారు.
 
లక్షణాలు కనిపించని వాళ్లు స్వేచ్ఛగా ప్రయాణించడం, ఇతరులతో కలవడం వల్ల వారికి వైరస్ వ్యాప్తి చెందుతోందని చెప్పారు. దక్షిణ కొరియా శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం కరోనా పాజిటివ్‌గా తేలి లక్షణాలున్నా లేకపోయినా అందరినీ ఐసోలేషన్‌ చేయాలని చెబుతున్నారు. యూనివర్సల్‌ మాస్కింగ్‌ అనేది వైరస్‌ను పీల్చుకునే మొత్తాన్ని తగ్గిస్తుందని ఈ అధ్యయనం చెబుతోంది. జామా ఇంటర్నల్ మెడిసిన్ పత్రికలో ఈ అధ్యయనం ఫలితాలు వెల్లడయ్యాయి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: