మూడు రాజధానుల విషయంలో జగన్ కు చంద్రబాబు భారీ షాక్ ఇవ్వనున్నారా...?
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన కాలయాపనే జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి కారణమైంది. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో శాశ్వత భవనాలను నిర్మించి రాజధానిని అభివృద్ధి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కానీ చంద్రబాబు మాత్రం తాత్కాలిక నిర్మాణాలపైనే తప్ప శాశ్వత నిర్మాణాలపై దృష్టి పెట్టలేదు. చంద్రబాబు కాలయాపన అమరావతి పాలిట శాపంగా మారాయి.
కేంద్రం అఫిడవిట్ మూడు రాజధానుల విషయంలో జగన్ సర్కార్ కే అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు తక్కువేనని తెలుస్తోంది. అమరావతిపై టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అందువల్ల కోర్టు ఈ ఖర్చు విషయంలో జగన్ సర్కార్ ను ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. ఈ కోణంలోనే చంద్రబాబు లీగల్ గా ముందుకు వెళ్లనున్నారని తెలుస్తోంది. రైతులు కొత్త పిటిషన్లు దాఖలు చేసేలా చంద్రబాబు ప్రణాళిక వేశారని తెలుస్తోంది.
అమరావతి నుంచి రాజధానిని ఎట్టి పరిస్థితుల్లోను తరలించకూడదని చంద్రబాబు, రైతులు లీగల్ గా ఎంతవరకైనా పోరాడాలని భావిస్తున్నారు. 55,000 కోట్ల రూపాయలు అమరావతికి ఖర్చు చేశామనే లెక్కలనే ప్రధానంగా తీసుకుని ముందుకెళ్లాలని టీడీపీ అనుకుంటోంది. ఇప్పటికే భారీ మొత్తంలో ఖర్చు చేశాం కాబట్టి తరలిస్తే రాష్ట్రానికి నష్టమని టీడీపీ వాదనను వినిపించబోతుంది. అయితే హైకోర్టు మూడు రాజధానుల విషయంలో ఏ విధంగా స్పందించనుందో చూడాల్సి ఉంది.