లగడపాటితో జగడం

 తెలంగాణ విషయంలో వివాదస్పద వాఖ్యలు చేసిన ఎంపీ లగడపాటిపై తెలంగాణ ఎంపీలు ఫైర్ అయ్యారు. శుక్రవారం హస్తినలో టి-ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా తెలంగాణ ఎంపీలు పొన్నం ప్రభాకర్, గుత్తాసుఖేందర్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ విషయంలో తరచూ లగడపాటి తలదూర్చడం పద్దతికాదన్నారు.  నిత్యం తెలంగాణపై అనుచిత వాఖ్యలు చేయడానికి ఆయన ఎవరని ప్రశ్నించారు. తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయేనని అందరూ గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా తెలంగాణలో ఎప్పటి నుంచో ఉంటున్న సెటిలర్స్ మా సోదరులే..మాకు ఉన్న హక్కులన్నీ వారికీ వర్తిస్తాయని వివరించారు.  తెలంగాణ, సీమాంధ్ర ప్రజలు కలిసి ఉండాలని చెప్పడానికి టి.జి వెంకటేష్, లగడపాటి రాజగోపాల్ ఎవరని ప్రశ్నించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: