విశాఖ మాత్రం ఇందులో సురక్షితమే....!
అమ్మోనియం నైట్రేట్ వల్లనే ఈ భారీ ప్రమాదానికి ప్రధాన కారణం అని భావిస్తున్నారు అధికారులు. ఈ విషయాన్ని పరిశీలిస్తే మరి విశాఖ పోర్టులో అమ్మోనియం నైట్రేట్ నిల్వల కారణంగా ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఏమైనా ఉన్నాయా...? అని అనేక సందేహాలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయం గురించి కాస్త స్పష్టత ఇచ్చేసారు విశాఖ పోర్టు అధికారులు. ఇక్కడ ఇలాంటివి సమభావించే అవకాశమే లేదని నిపుణులు, అధికారులు కూడా స్పష్టం చేసేసారు. మరి ఎందుకు విశాఖ పోర్టు లో సంభవించవు అనే విషయానికి వస్తే...
ఇక పై విశాఖ పోర్టు లో అమ్మోనియం నిల్వలు ఉండవని అధికారులు చెప్పారు. అక్కడ కేవలం హ్యాండ్లింగ్ మాత్రమే జరుగుతుందని.... అమ్మోనియం నిల్వలు ఉండవని విశాఖ పోర్టు ఉన్నతాధికారులు తెలియ జేశారు. గత 20 సంవత్సరాలుగా ఇటువంటి సమస్యలు ఏవి ఇక్కడ తలెత్తలేదని అధికారులు స్పష్టం చేసారు. నిర్దిష్ట సమయం లో పకడ్బందీగా అన్‌లోడ్ చేస్తామని , విశాఖ పోర్టు లో పేలుళ్లు జరిగే పరిస్థితుల ఎప్పుడు లేవు, రావు అని నిపుణులు, అధికారులు కూడా చెప్పడం జరిగింది.