'కరోనీల్' రామ్ బాబాది కాదట.. హైకోర్టు లో బయటపడ్డ అసలు నిజాలు..?
ప్రస్తుతం పతాంజలి వాడుతున్న కరోనీల్ బ్రాండ్ పేరుతో ముందుగానే ట్రేడ్మార్క్ రిజిస్టర్డ్ చేసుకున్నట్లు తెలిపిన పిటిషనర్... 2027 వరకు ఈ బ్రాండ్ ను ఎవరు వాడుకోకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. బ్రాండ్ పై పూర్తిగా తమకు మాత్రమే హక్కులు ఉన్నాయని తెలిసినా పిటిషనర్... పతాంజలి పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పిటిషనర్ వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు... పిటిషనర్ వాదనతో ఏకీభవించింది. ట్రేడ్ మార్క్ లిస్ట్ లో ముందుగా చెక్ చేసుకుని ఉంటే సమస్య వచ్చేది కాదని... ఇలాంటి నేపథ్యంలో కరోనిల్ బ్రాండ్ వాడుకునేందుకు అనుమతించాలంటూ హైకోర్టును కోరడం సమంజసం కాదు అంటూ వ్యాఖ్యానించారు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి.
ఇకపై పతాంజలి కరోనీల్ బ్రాండ్ ను వాడేందుకు వీలు లేదు అంటూ స్పష్టం చేసింది మద్రాస్ హైకోర్టు. అంతేకాదు పతాంజలి నుంచి విడుదల చేసిన కరోనీల్ ఔషధం కరోనా వైరస్ ను నయం చేస్తుంది అంటూ చెప్పి ప్రజల భయాన్ని క్యాష్ చేసుకున్న పతాంజలి కి 10 లక్షల రూపాయల జరిమానా విధించింది మద్రాస్ హైకోర్టు. పతాంజలి ప్రవేశపెట్టిన కరోనీల్ కరోనా ను నయం చేసే మందు కాదని... కేవలం దగ్గు జలుబు రాకుండా రోగనిరోధక శక్తిని మాత్రమే పెంచుతుందని... కానీ పతాంజలి దీని పై దుష్ప్రచారం చేసింది అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పుతో పతాంజలి కి భారీ షాక్ తగిలింది అని చెప్పాడు,