ప్రియుడితో బెడ్రూమ్లో నగ్నంగా కూతురు.. రెచ్చిపోయిన పేరెంట్స్..!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాందా జిల్లా మతౌద్ ఏరియా కర్చా గ్రామానికి చెందిన ప్రియా(19) అదే ప్రాంతానికి చెందిన శంకర్(23) కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇద్దరు ఏకాంతంలో మునిగిపోయారు. ఇద్దరూ శృంగారంలో ఉండగా సడెన్గా యువతి కుటుంబ సభ్యులు వచ్చారు. ప్రియుడితో గదిలో నగ్నంగా అసభ్యకర రీతిలో ఉన్న కూతురిని చూసిన కుటుంబ సభ్యులు కోపంతో రగిలిపోయారు.
అయితే వారు తమ పరువు తీసిందన్న కోపంతో కూతురిని, ఆమె ప్రియుడిని సజీవంగా తగలబెట్టేశారు. ఆ చిన్న గుడిసెకి బయటి నుంచి తాళం వేసి ఇద్దరినీ లోపల బంధించి బయటి నుంచి గుడిసెకి నిప్పు పెట్టేశారు. అగ్నికీలల్లో చిక్కుకున్న ప్రేమికులు మంటల్లో కాలిపోయారు. ప్రియుడు శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 80 శాతం గాయాలతో ప్రియురాలిని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అయితే ఆమె పరిస్థితి విషమించడంతో కాన్పూర్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆమెను కాన్పూర్ తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు కోల్పోయింది. విషయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశామని తెలిపారు. మిగిలిన కుటుంబ సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. పరువు హత్యలుగా భావిస్తున్నట్లు తెలిపారు.