కరోనా : 105 ఏళ్ళ మహిళా.. అందరిలో దైర్యం నింపింది..?

praveen
ప్రస్తుతం కరోనా  వైరస్ విషయంలో ఎన్నో  ఆందోళనలు రేకెత్తుతున్న  విషయం తెలిసిందే. ముఖ్యంగా వృద్ధులు కరోనా  వైరస్ బారిన పడితే ఎంతో  ప్రమాదం అన్నది ప్రస్తుతం... ఎన్నో నివేదికలు చెబుతున్నాయి. కరోనా వైరస్ వృద్దులకు  ఎంతో ప్రమాదకరం అంటూ చెబుతున్నాయి. వాస్తవంగా మాత్రం ఎంతో మంది వృద్ధులు సైతం కరోనా  వైరస్ ను జయించి కోలుకుంటున్నారు. వందేళ్లకు పైగా వయస్సు ఉన్నప్పటికీ కూడా వృద్ధులు కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపీలో కూడా 105 ఏళ్ల ఓ భామ  కరోనా  వైరస్ నుంచి కోలుకుని అందరిలో ధైర్యాన్ని నింపింది.



 కర్నూలు జిల్లా పాతబస్తీలోని పెద్ద పడఖానా  వీధిలో  మోహనమ్మ అనే వృద్ధురాలు ఉంటుంది. ఆమె వయసు 105 ఏళ్ళు . భర్త 1991 లోనే మరణించడంతో... అప్పటి నుంచి ఎంతో ధైర్యంగా కుటుంబాన్ని ముందుకు లాక్కొచ్చింది. ఈమెకి ఎనిమిది మంది సంతానం ఉండగా వారికి పెళ్లిళ్లు అయ్యాయి పిల్లలు కూడా ఉన్నారు, ఇప్పటికికూడా తన పనుల విషయంలో ఎవరి మీదా ఆధారపడకుండా తన పనులు తానే  చేసుకుంటుంది ఈ భామ . ఆరోగ్యం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది మోహనమ్మ . ఈ క్రమంలోనే స్థానికంగా ఉన్న... 60 ఏళ్ళ పైబడిన వారు అందరికీ కూడా కరోనా  నిర్ధారణ పరీక్షలు చేసారు వాలింటర్లు.



 ఈ పరీక్షల్లో భాగంగా 105 ఏళ్ల వయస్సు ఉన్న మోహనమ్మకు   కరోనా  పాజిటివ్ అని తేలింది. దీంతో కుటుంబ సభ్యులు అందరూ ఆ వృద్ధురాలిని కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు, ఆమెకు కరోనా  సోకడంతో ఆయాసం జ్వరం లాంటి లక్షణాలు కనిపించడంతో ఆక్సిజన్ అందించారు వైద్యులు. కరోనా  వైరస్ చికిత్స తీసుకున్న మోహనమ్మ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇక 105 ఏళ్ల వృద్ధురాలు కరోనా వైరస్ బారి నుంచి కోలుకోవటం అందరిలో  ధైర్యాన్ని నింపింది.  ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లే ఆమెను కరోనా  వైరస్ నుంచి బయట పడేలా చేశాయి అంటూ చెబుతున్నారు వైద్యులు,

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: