చారిత్రాత్మక ఘటన కాదిది.. లౌకికవాదం చచ్చిపోయిన రోజు: ఒవైసీ

frame చారిత్రాత్మక ఘటన కాదిది.. లౌకికవాదం చచ్చిపోయిన రోజు: ఒవైసీ

Suma Kallamadi
అసదుద్దీన్‌ ఒవైసీ గురించి అందిరికీ తెలిసే ఉంటుంది. హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం చీఫ్‌ అయిన ఓవైసీ మొదటి నుండీ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చర్యలను వ్యతిరేకిస్తూనే వున్నారు. ఇపుడు తాజాగా అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్రమోదీని తప్పుబట్టారు. ప్రధాని మోదీ హిందూ వాదానికి ఈరోజు పునాది వేశారని, లౌకిక వాదాన్ని చంపేశారని విమర్శించారు.

ఈరోజు అనగా.. బుధవారం ఆయన ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ఒక దేశ ప్రధానికి ఏ ఒక్క మతంపైన ప్రేమ ఉండకూడని, సర్వ మత సంగమం కలిగి ఉండాలని, అలాగే... వారికి ఒక మందిరంపైన గానీ అలాగే.. ఒక మసీదు పైన గానీ ప్రేమ ఉండకూడదని విమర్శించారు. ఈ సందర్భంగా.. అయోధ్య వివాదంలో బీజేపీ, సంఘ్‌పరివార్‌ సుప్రీంకోర్టుకు అసత్యాలు చెప్పారని ఆరోపించారు.

ఇకపోతే, దానికి ముందు సోషల్ మీడియా వేదికగా కూడా ఒవైసీ మోడీ పైన విరుచుకు పడ్డారు. పోస్టులో ప్రస్తావిస్తూ... "బాబ్రీ మసీదు ఉంది, ఇకపై ఖచ్చితంగా ఉంటుంది" అనే అర్థం వచ్చేలాగా 'బాబ్రీ జిందా హై' అనే హ్యాష్ ‌ట్యాగ్స్‌‌ జోడించారు. అయోధ్య రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీం కోర్టు గత సంవత్సరం నవంబరులో తీర్పు వెలువరించిన విషయం అందరికీ తెలిసినదే. అక్కడి నుండి ఒవైసీ ఏదో ఒకరకంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే వున్నారు.

తీర్పులో భాగంగా... వివాదానికి ముఖ్య కారణం అయిన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని న్యాయ స్థానం పేర్కొంటూ.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలోనే అయోధ్య నుండి, 18 కి.మీల సమీపంలో యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు, స్థలం కేటాయించింది. అయినా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోని కొందరు నాయకులు కేంద్రం పైన విమర్శనాస్త్రాలు విసురుతూనే వున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: