.అదే కాన్సెప్ట్.. అదే దర్శకుడు..మోక్షజ్ఞ కోసం కథ రాస్తున్న బాలయ్య..?

frame .అదే కాన్సెప్ట్.. అదే దర్శకుడు..మోక్షజ్ఞ కోసం కథ రాస్తున్న బాలయ్య..?

praveen
ప్రస్తుతం నందమూరి అభిమానులు అందరూ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తుంది నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం. అయితే మోక్షజ్ఞ ఎంట్రీ పై గత కొన్ని రోజుల నుంచి ఎన్నో వార్తలు వస్తున్నప్పటికీ అధికారికంగా  మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు. నందమూరి బాలకృష్ణ తన వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు మోక్షజ్ఞని పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారని.. బోయ పాటి  లేదా పూరి జగన్నాథ్ తో  మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అంటూ గతంలో ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ అభిమానులకు నిరాశ మిగిల్చాయి. మరోవైపు మోక్షజ్ఞ కు  సినిమాలపై ఆసక్తి లేదని.. వ్యాపారం పైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు అనే వార్తలు కూడా అభిమానులను ఎంతగానో నిరాశ పరిచాయి.



కానీ ఆ తర్వాత మోక్షజ్ఞ  సినిమాల్లోకి వస్తాడు అంటూ బాలకృష్ణ క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో కొత్త ఆశలు చిగురించాయి. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు అనేది మాత్రం ప్రస్తుతం అభిమానులందరికీ ఒక పెద్ద ప్రశ్నగా మారిపోయింది. ప్రస్తుతం మరోసారి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి టాలీవుడ్ టౌన్ లో  ఆసక్తికర టాక్ వినిపిస్తోంది. 2021 లో మోక్షజ్ఞ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది అంటూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో  వినిపిస్తున్న టాక్ ప్రకారం... మోక్షజ్ఞ ఎంట్రీ కోసం బాలకృష్ణ కొంతమంది రచయితలతో సంప్రదింపులు జరుపుతున్నారని... స్వయంగా బాలకృష్ణ కథను డెవలప్ చేస్తున్నారు అంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది. స్క్రిప్ట్ వర్క్ విషయంలో బాలయ్య  ఎంతో కష్ట పడుతున్నారని... స్క్రిప్ట్ వర్క్  పూర్తయిన వెంటనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అంటూ టాక్.


అయితే గతంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఆదిత్య369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 అని ఒక కొత్త కాన్సెప్ట్ ను మోక్షజ్ఞ కోసం బాలకృష్ణ సిద్ధం చేస్తున్నారు అంటూ టాక్  వినిపిస్తుంది. అంతే కాకుండా ఈ సినిమా తెరకెక్కించే బాధ్యతలను కూడా.. ఆదిత్య369 డైరెక్టర్ సంగీతం శ్రీనివాస్ రావు కే ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో  వినిపిస్తున్న టాక్ మాత్రం నందమూరి అభిమానులకు కాస్త సంతృప్తిని ఇస్తున్నప్పటికీ ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: