ఇది విన్నారా.. కరోనాను ఖతం చేసే ఫేస్ మాస్క్.. ధర ఎంతంటే??
అయితే ఇన్ని పరిశోధనలు జరుగుతున్నా.. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అన్నదానికి సరైనా సమాధానం లేదనే చెప్పాలి. అయితే.. వ్యాక్సిన్ సంగతి పక్కన పెట్టండి తాము రూపొందించిన ఫేస్ మాస్క్ పెట్టుకుంటే చాలు కరోనా దానంతట అదే ఖతమవుతుందంటుంది ముంబైకి చెందిన స్టార్టప్ సంస్థ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నానోటెక్నాలజీని ఉపయోగించి ముంబై కి చెందిన స్టార్టప్ సంస్థ రూపొందించిన ఫేస్ మాస్క్ నోరు ముక్కు ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా చూడటమే కాకుండా కరోనా వైరస్ ను కూడా ఖతం చేయగలదట.
థర్మ్సెన్స్ తయారుచేసిన ఈ మాస్క్ కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించడమే కాదు.. మాస్క్ బయటి పొరకు వైరస్ అంటుకునేలా చేసి దానిని అక్కడకక్కడే నాశనం చేస్తుంది. ఇక ఈ ఫేస్ మాస్క్ కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే.. ఈ మాస్క్ వాష్ చేసుకుంటూ 60 నుంచి 150 సార్లు వరకూ యూజ్ చేయవచ్చని స్టార్టప్ సంస్థ పేర్కొంది. ధర విషయానికి వస్తే.. ఒక్కో మాస్క్ రూ. 300 నుంచి 500 రూపాయల మధ్య ఉండవచ్చని సమాచారం. కాగా, ఈ మాస్కుల తయారీకి, వాడకానికి అనుమతి కూడా పొందాయి. దీంతో త్వరలోనే ఈ మాస్కులు మార్కెట్‌లోకి రానున్నాయని తెలుస్తోంది. ఏదేమైనా ఈ కరోనా కష్టకాలంలో స్టార్టప్ సంస్థ ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది.