శానిటైజర్ అమ్మకాలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం....?
శానిటైజర్‌తో చేతులను ఎక్కడైనా శుభ్రం చేసుకునేందుకు వీలు ఉండటంతో వీటి వినియోగం భారీగా పెరిగింది. శానిటైజర్ నిత్యావసర వస్తువుల్లో ఒకటిగా మారిపోయింది. దీంతో శానిటైజర్ల కొరత లేకుండా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. శానిటైజర్లు నిల్వ ఉంచేందుకు, అమ్మేందుకు ఇకపై అనుమతులు అవసరం లేదని కీలక ప్రకటన చేసింది. వెంటనే ఈ నిబంధన అమల్లోకి వస్తుందని కీలక ప్రకటన చేసింది.
కొత్తగా 600 సంస్థలకు శానిటైజర్ల తయారీ కోసం కేంద్రం అనుమతులు ఇచ్చింది. శానిటైజర్ల ధరల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుని ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చేసింది. 200 మిల్లీలీటర్ల శానిటైజర్ ధర 100 రూపాయల కంటే ఎక్కువ ఉండరాదని స్పష్టం చేసింది. సంస్థలు ఎక్స్పైరీ డేట్ దాటిన శానిటైజర్ నిల్వలను తమ వద్ద ఉంచుకోరాదని.. అమ్మకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతంలో లైసెన్స్ ఉన్నవాళ్లు మాత్రమే శానిటైజర్ విక్రయించాలనే నిబంధన ఉండేది. ప్రస్తుతం శానిటైజర్ నిత్యావసర వస్తువుగా మారడం... లైసెన్సు తప్పనిసరి అనే నిబంధనను సడలించాల్సిందిగా అనేక విజ్ఞప్తులు రావడంతో కేంద్రం తాజా నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ యాక్ట్ శానిటైజర్ కు లైసెన్స్ తప్పనిసరి అనే నిబంధనలను తాజాగా సడలించింది. మరోవైపు దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీలో నిన్న ఒక్కరోజే 10,000 కు పైగా నమోదైన కేసులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ నియంత్రణ సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.