అమెరికా నుంచే ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్.... ట్రంప్ కీలక వ్యాఖ్యలు....?
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి ప్రజల్లో భయాందోళనను అంతకంతకూ పెంచుతోంది. ప్రపంచ దేశాల ప్రజలు కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. 2020 డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. పలు దేశాల వ్యాక్సిన్లు తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు సాధించడంతో వ్యాక్సిన్ పై ఆశలు చిగురించాయి.
ప్రపంచ దేశాల ప్రజలు కరోనా వ్యాక్సిన్ కొరకు అశగా ఎదురు చూస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించబోతుందని చెప్పారు. పలు దేశాల వ్యాక్సిన్లు తుది దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్న తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ట్రంప్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దాన్ని అంతటా సరఫరా చేస్తామని... ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా శరవేగంగా జరుగుతుందని చెప్పారు.
కరోనా విజృంభించిన సమయంలో అమెరికా ఇతర దేశాలకు వెంటిలేటర్లు, ఇతర వైద్య సామాగ్రిని సరఫరా చేసిందని... అదే విధంగా వ్యాక్సిన్ ను కూడా సరఫరా చేయనుందని ట్రంప్ అన్నారు. ట్రంప్ బృందం ఇప్పటికే మెరుగైన ఫలితాలను సాధిస్తున్న మోడెర్నా టీకా 2021 జనవరినాటికి ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది. రెండో రోజుల క్రితం మోడెర్నా టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ మొదలయ్యాయి.
మోడెర్నా 30,000 మంది వాలంటీర్లపై తయారు చేసిన వ్యాక్సిన్ ను ప్రయోగించనుంది. మరోవైపు మన దేశంలో ప్రతిరోజూ 48,000కు అటూఇటుగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 48,513 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 768 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15,31,669 కరోనా కేసులు నమోదు కాగా 34,193 మంది మృతి చెందారు. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 64.24 శాతానికి చేరగా మరణాల రేటు 2.25 శాతంగా ఉంది.