కొవిడ్-19 రోగికి రూ. 17.5 లక్షల బిల్లు వేసిన హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రి..!

Suma Kallamadi

కరోనా వైరస్ బారినపడిన రోగులు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగానే అదే అదునుగా భావించి... వారి నుండి లక్షల రూపాయలు దండుకుంటున్నారు డాక్టర్లు. కేవలం ఒక్క రోజుకే లక్షల రూపాయల బిల్లు వేస్తున్న ప్రైవేటు ఆసుపత్రుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారతదేశంలో ధనికులు తప్ప మిగతా వారందరూ కరోనాకి బలి కావాల్సిందే అనేది అక్షర సత్యం అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ వాక్యాలను బలపరిచే విధంగా తాజాగా చోటు చేసుకున్న ఒక సంఘటన నిలుస్తుంది. హైదరాబాద్ నగరంలో ఒక ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యం పది రోజులకు గాను ఒక కరోనా రోగికి రూ. 17 లక్షల 50వేల బిల్లు వేసింది. 


పూర్తి వివరాలు తెలుసుకుంటే... కరోనా వ్యాధితో బాధ పడుతున్న సత్యనారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి సోమాజిగూడ డెక్కన్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం జాయిన్ అయ్యాడు. అయితే అతను జాయిన్ అయిన పది రోజుల్లోనే 17 లక్షల 50 వేల రూపాయల బిల్లు వేసింది డెక్కన్ ఆసుపత్రి యాజమాన్యం. మరోవైపు అతని భార్య కూడా కరోనా వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న సత్యనారాయణరెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. 


ఆపై సత్యనారాయణరెడ్డి మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఆస్పత్రి యాజమాన్యం అడ్డు చెప్పింది. అప్పటికే కుటుంబ సభ్యులు సత్యనారాయణ రెడ్డి చికిత్స నిమిత్తం ఎనిమిది లక్షల రూపాయలను చెల్లించారు. కానీ మిగతా డబ్బులు కూడా చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని డెక్కన్ హాస్పిటల్ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతుంది. సరిగ్గా మూడు రోజుల క్రితం సత్యనారాయణ రెడ్డి అన్నయ్య కుమారుడైన హరీష్ కరోనా తో బాధపడుతూ మృత్యువాత పడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: