భారత్ లో పబ్ జి.. ఇక ఆడటం కష్టమేనా..?

praveen
చైనా గాల్వాన్ లోయలో  ఘర్షణకు తెరలేపిన తర్వాత చైనాకు ఒక్కొక్కటిగా భారీ షాక్ లు తగులుతున్న విషయం తెలిసిందే. భారత్ క్రమక్రమంగా చైనా ను బహిష్కరిస్తు వస్తుంది. అన్ని విధాలుగా చైనాను బహిష్కరించేందుకు ప్రణాళికలు  సిద్ధం చేస్తూ వాటిని అమలు చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే చైనా కు సంబంధించి భారతదేశంలో ఉన్న పలు కాంట్రాక్టులు  రద్దు చేసి చైనా కు  భారీ షాక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం... ఆ తర్వాత చైనా యాప్ ల ద్వారా వినియోగదారుడి డేటా తస్కరణ కు గురి అవుతుంది అన్న  ఆరోపణలతో చైనా కు సంబంధించిన 59 యాప్స్ ని  భారత్ లో  నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం మరింత సంచలనంగా మారింది.



ఇలా చైనా కు వరుస షాకులు ఇస్తూ వచ్చిన భారత్ ఇప్పుడు మరో భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అయింది. మొన్నటికి మొన్న అత్యంత ఆదరణ ఉన్న టిక్ టాక్ ను భారత్ లో  నిషేధించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు... ఎక్కువ ఆదరణ ఉన్న పబ్జి,  లూడో సహా 275 యాప్ లను  నిషేధించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ నిషేధం అమలు లోకి కూడా రానందని  సమాచారం. ప్రస్తుతం భారత్ చైనా మధ్య ఉన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సమాచారం  తస్కరణకు గురయ్యే అవకాశం ఉందని చైనా  సంబంధించిన యాప్ లపై దృష్టి పెట్టాయి నిఘా వర్గాలు. ఈ నేపథ్యంలోనే జాతీయ భద్రతకు ముప్పు కలిగించేలా  ఉన్న 275 చైనా యాప్లను కూడా అధికారులు నిషేధించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.


 ఇక దీనిపై సమగ్ర విచారణ జరిపిన అధికారులు పూర్తి నివేదికను కేంద్ర ముందుంచారు. యాప్స్ నిషేధానికి సంబంధించిన... ఉత్తర్వులు ఇంకొన్ని రోజుల్లో జారీ కానున్నట్లు తెలుస్తోంది, ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న భారత్ నుంచి నిషేధింపబడిన చైనా యాప్ టిక్ టాక్ ప్రస్తుతం నష్టాల్లో కూరుకుపోయిన విషయం తెలిసిందే, ఎందుకంటే టిక్ టాక్ కి  ఉన్న వినియోగదారులు ఎక్కువ మొత్తంలో భారత్ లోనే ఉండడంతో  భారీ లాభాలను ఆర్జించిన టిక్ టాక్... నిషేధానికి గురి కావడంతో దివాలా తీసింది.Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: