పరాయి వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం.. దీంతో కొడుకు ఏం చేసాడో తెలుసా..?
ఈ మధ్య కాలంలో బంధాలకు బంధుత్వాలకు విలువ లేకుండా పోతుంది. ఏకంగా కట్టుకున్న వారిని కాదని పరాయి వాళ్ళ తో అక్రమ సంబంధానికి తెరలేపుతున్నారు చాలామంది. ఈ రోజుల్లో చాలానే అక్రమ సంబంధాలు తెరమీదకి వస్తుండగా. ఎన్నో దారుణాలకు కారణమవుతున్నాయి ఇలాంటి అక్రమ సంబంధాలు. ఎంతో మంది అక్రమ సంబంధాల కారణంగా మనస్థాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే... కొంతమంది అక్రమ సంబంధాల నేపథ్యంలో హత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి దారుణం ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది.
తల్లి పరాయి వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని తెలిసి కొడుకు తల్లి ప్రియున్ని అతి దారుణంగా హత్య చేశాడు. కర్ణాటకలోని విజయపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన . వివరాల్లోకి వెళ్తే... హాలియాద గ్రామానికి చెందిన సవిత, మల్లప్ప భార్య భర్తలు.. వీరిద్దరూ కలిసి కుమారుడితో నివాసం ఉంటున్నారు. ఇక గత కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన అమరనాథ సోలాపూర అనే వ్యక్తితో సవితకు పరిచయమయ్యింది.కొన్ని రోజుల్లోనే అది అక్రమ సంబంధానికి దారితీసింది. దీంతో ఇంట్లో వాళ్ళకి తెలియకుండా రహస్యంగా కవితా అమరనాథ సోలాపూర తో కలుస్తూ ఉండేది.
ఈ విషయం భర్త వరకు పొక్కడంతో భర్త ఎన్నోసార్లు సవితను హెచ్చరించాడు. కానీ ఎన్నిసార్లు హెచ్చరించిన ఆమె తీరులో మాత్రం మార్పు రాలేదు. ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తూనే వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవలే మంగళవారం రాత్రి భర్త కొడుకు నిద్ర పోయిన సమయంలో ఇంటికి సమీపంలో ఉన్న ఓ తోటలోకి ప్రియుడిని రప్పించింది. అతనితో శృంగారంలో మునిగితేలుతోంది సవిత . ఇక ఇంట్లో భార్య కనిపించకపోవడంతో అనుమాన పడిన మల్లప్ప కొడుకుతో కలిసి సమీపంలోని తోటలోకి వెళ్లగా ప్రియుడితో నగ్నం గా కనిపించింది. దీంతో కోపోద్రిక్తుడైన మల్లప్ప కొడుకుతో కలిసి భార్య ప్రియున్ని కొడవలితో దారుణంగా నరికి చంపేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.