రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్న జెఫ్ బెజోస్.. తాజా రికార్డు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన అమేజాన్ అధినేత జెఫ్ బెజోస్ ప్రస్థానం అవసరం లేదేమో.. కలలు కంటున్న యువతకు ఆయనొక ఐకాన్. అయన సృష్టించిన అమెజాన్ ప్రపంచములో దాదాపు యావత్ విశ్వం అంతటా సభ్యులు వున్నారు. దీని ద్వారా ఎంతోమంది వినియోగదారులు సేవలు పొందుతున్నారు. ప్రపంచాన్ని దాటి, ఎన్నో మెట్రో నగరాలను దాటి, ఈనాడు మారుమూల పల్లెటూళ్లవరకు దీని సేవలు విస్తరించాయంటే ఔరా అనిపించక మానదు.
సంపద విషయానికొస్తే.. అయన ఎన్నో మైలురాళ్లను అధిరోహించారు. ఇపుడు తాజాగా మరో రికార్డు సృష్టించాడు. ఆయనకు ఒకే ఒక్క రోజులోనే రూ.97వేల కోట్లు వచ్చి పడ్డాయి. ఇప్పటివరకు ఓ వ్యక్తి ఒక్క రోజులో ఇంత సంపదను సంపాదించిన దాఖలాలు లేవు. అలాంటిది, ఇప్పుడు ఈ ఘనత జెఫ్ బెజోస్‌కు మాత్రమే దక్కింది. ఈ రికార్డుతో ఆయన సంపద విలువ కాస్త... 189 బిలియన్ డాలర్లకు చేరింది.
ఈ ప్రకారంగా లెక్కించు కుంటే, జెఫ్ బెజోస్ ఈ ఒక్క ఏడాదిలోనే 74 బిలియన్ డాలర్లు సంపాదించినట్లు తెలుస్తోంది. అసలు వివరాల్లోకి వెళితే... ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ "గోల్డ్ మాన్ శాక్స్" కూడా అమెజాన్ షేర్లపై అనుకూలమైన రేటింగ్ ఇవ్వడంతో, స్టాక్ మార్కెట్ ప్రపంచంలో అమెజాన్ దుమ్ము దులిపింది. తాజా లెక్కల ప్రకారం, అమెజాస్ షేర్స్ 2018 తర్వాత ఈ స్థాయిలో లాభాన్ని ఆర్జించడం ఇదే తొలి సారి.
ఇకపోతే.. తాజాగా మార్కెట్‌లో అమెజాన్ షేర్ విలువ అమాంతం పెరగడంతో జెఫ్ బెజోస్ సంపద మరింత రెట్టింపు అయినట్లు పలు వ్యాపార దిగ్గజ నిపుణులు పేర్కొంటున్నారు. వెబ్ ఫాషన్ ట్రెండ్స్ పై సానుకూల పరిస్థితుల నేపథ్యంలో అమెజాన్ షేర్ విలువ దూసుకెళ్లినట్లు వీరు అభిప్రాయపడుతున్నారు. దీంతో కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే నంబర్ వన్ కుబేరుడిగా వున్న అమెజాన్ చైర్మన్ జెఫ్ బెజోస్ సంపద మరింత పెరిగి, మరలా నెంబర్ వన్ కాబోతున్నారని సమాచారం.