క‌రోనా పేరు చెపితే ప్ర‌పంచం వ‌ణుకుతుంటే... ఆ దేశాల పేర్లు చెపితే క‌రోనాయే వ‌ణుకుతోంది...!

VUYYURU SUBHASH

ఎక్క‌డో చైనాలోని వుహాన్ న‌గ‌రంలో పుట్టిన క‌రోనా వైర‌స్ ఇప్పుడు ప్ర‌పంచాన్ని ఎలా వ‌ణికిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ వైర‌స్ మాన‌వ మ‌నుగ‌డకే పెను ముప్పుగా మారింది. ఇప్ప‌టికే ఈ వైర‌స్ భారీన ప‌డి ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా 6 ల‌క్ష‌ల మంది చ‌నిపోయారు. గ‌త యేడాది చివ‌ర్లో చైనాలో అల్ల‌క‌ల్లోలం క్రియేట్ చేసిన ఈ వైర‌స్ ఇప్పుడు ఏకంగా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. 

 

ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాలు క‌రోనా వ్యాక్సిన్ కోసం అనేక ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇవి ఎప్ప‌ట‌కి ఓ కొలిక్కి వ‌స్తాయో కూడా స‌రైన క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే ప్ర‌పంచంలో 220కు పైగా దేశాలు క‌రోనా దెబ్బ‌తో గ‌జ‌గ‌జ వ‌ణుకుతుంటే 12 దేశాల‌ను మాత్రం క‌రోనా ఇప్ప‌ట‌కీ ట‌చ్ చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్య‌మే. ఆ దేశాల్లో క‌రోనా లేద‌ని అగ్ర రాజ్యం అమెరికా కూడా చెప్పింది. 

 

ఇవ‌న్నీ చాలావరకు పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశాలే కావడం విశేషం. సోలోమన్ ఐలాండ్స్ - వనౌటు - మైక్రోనేషియా దీవుల సమాఖ్య -మార్షల్ దీవులు -పలావ్ -తువాలు - ఉత్తర కొరియా - నౌరు - తుర్క్ మెనిస్థాన్ - సమోవా - కిరిబాటి - టోంగా దేశాల్లో క‌రోనా లేదు. చైనాలో క‌రోనా వ్యాప్తి చెందుతున్న విష‌యం తెలియ‌గానే ఉత్త‌ర కొరియా చైనాతో స‌రిహ‌ద్దులు పూర్తిగా మూసేసింది. ఇక పూర్వ‌పు సోవియ‌ట్ యూనియ‌న్‌లోని తుర్క్ మెనిస్థాన్ విషయానికొస్తే ఆరంభంలోనే చైనాకు విమానాలు రద్దు చేసింది. 

 

ఇక ద‌క్షిణ ప‌సిఫిక్ మ‌హా స‌ముద్రంలోని ద్వీపాల విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ ప్ర‌జ‌లు ఇప్ప‌ట‌కీ సంప్ర‌దాయాలు పాటిస్తుంటారు. దీంతో ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చిన వారి విష‌యంలో క‌ఠిన నిబంధ‌న‌లు పాటించ‌డంతో ఈ దేశాల్లోకి అస్సలు క‌రోనా ఎంట‌ర్ కాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: