N95 మాస్కులు వాడే వాళ్లకు షాకింగ్ న్యూస్.... వీటి ద్వారా కరోనా సోకే అవకాశం..?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. లాక్ డౌన్ సడలింపులకు మునుపు తెలుగు రాష్ట్రాల్లో 200కు అటూఇటుగా కేసులు నమోదు కాగా ప్రస్తుతం వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రజలు మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్లే రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో చాలామంది N95 మాస్కులు ఎంతో సురక్షితమని భావించి వాటిని ఉపయోగిస్తున్నారు. 
 
అయితే ఈ మాస్కుల గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తాజాగా N95 మాస్కుల వినియోగం గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. వాల్వ్ కలిగిన మాస్కులు ఉపయోగిస్తే ఎటువంటి ఉపయోగం ఉండదని అన్ని రాష్ట్రాల వైద్యాధికారులకు లేఖలు రాసింది. ఈ మాస్కులు వ్యక్తి నోటి నుంచి విడుదలయ్యే వైరస్ ను ఆపలేవని పేర్కొంది. ప్రజలు నోరు, ముక్కును పూర్తిగా కప్పే వాటిని మాత్రమే ఉపయోగించాలని సూచించింది. 
 
కరోనా వైరస్ విజృంభణ తరువాత దేశవ్యాప్తంగా N95 మాస్కులకు ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకు అత్యంత సూక్ష్మ పరిమాణంలో ఉన్న తుంపర్లను N95 మాస్కులు నియంత్రించగలవని వైద్యులు అభిప్రాయపడ్డారు. కానీ తాజాగా ఈ మాస్కులు సురక్షితం కాదని తేలడం ఈ మాస్కులను ఉపయోగించిన వారిని టెన్షన్ పెడుతోంది. సాధారణంగా వైద్యులు ఈ మాస్కులను ఎక్కువగా ఉపయోగిస్తారు. 
 
N95 మాస్కులు మ‌ళ్లీ మ‌ళ్లీ ఉపయోగించే వీలు ఉండటంతో వీటిని ఉపయోగించే వీలు ఉండటంతో ఎక్కువ శాతం మంది ఈ మాస్కుల పట్ల ఆసక్తి చూపారు. అయితే వాల్వ్ లేని N95 మాస్కులను ఉపయోగించడం వల్ల ఎలాంటి నష్టం కలగదు. ప్రజలు మాస్కుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే వైరస్ ల భారీన పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.            

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: