74 టైర్ల భారీ వాహనం.. 10 నెలల సమయం.. 1,700 కి.మీ దూరం !
తిరువనంతపురంలోని విక్రమ్ సారాబాయ్ స్పేస్ సెంటర్ కు ఓ మెషీనరిని తరలించడానికి ఓ వాహనం 10 నెలలు ప్రయాణించింది. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ? పది నెలలు ప్రయాణించడానికి ఆ వాహనంలో స్పేస్ కు సంబంధిన ఏ వస్తువు ఉందనే గా మీ డౌట్. అయితే క్లారిఫై చేసుకుందాం రండీ.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో భాగమైన విక్రమ్ సారాబాయ్ స్పేప్ సెంటర్ కు నాసిక్ నుంచి తిరువనంతపురం మధ్య దూరం 1,700 కిలోమీటర్ల. సాధారణంగా ట్రక్కులు నాసిక్ నుంచి తిరువనంతపురం చేరుకోవడానికి ఐదు నుంచి ఏడు రోజులు పడుతుంది. కానీ, ఓ వాహనం స్పేస్ సెంటర్ కు చేరుకోవడానికి ఏకంగా 10 నెలల సమయం తీసుకుంది.
మిగిలిన నెలల భారీ భద్రత నడుమ ఐదు రాష్ట్రాలు గుండా మెల్లిగా సాగిన ప్రయాణంలో దారి మధ్యలో చెట్ల తొలగింపు, విద్యుత్ స్తంభాలను తొలగించాల్సి వచ్చింది. ఈ భారీ వాహనంలో రాకెట్ ప్రయోగాల ఇంజిన్ లో ఉష్ణోగ్రత, ప్రెషర్ ను పెంచడానికి అవసరమైన పదార్థాల కోసం వినియోగించే ఆటోక్లేవ్ ను తరలించామని మెషీనరీ తరలింపుతో పాల్లొన్న ఓ ప్రైవేట్ ఉద్యోగి సుభాష్ యాదవ్ తెలిపారు.
ఆయన మాట్లాడతూ..‘‘లాక్ డౌన్ కారణంగా మా ప్రయాణం దయనీయంగా మారింది. ఒక్క ఏపీలోనే నెల రోజు వాహనాన్ని ఆపాల్సి వచ్చింది. సంస్థ యాజమాన్యం జోక్యం చేసుకున్నా.. తరలింపు ప్రక్రియ మాకు సవాల్ గా మారింది. ఇంజినీర్లు, మెకానిక్లు అంటూ మొత్తం 30 మంది ఈ వాహనంలో ప్రయాణించాం. గతేడాది సెప్టెంబర్ 1న నాసిన్ నుంచి ప్రయాణం మొదలు పెట్టాం’’ అని సుభాష్ యాదవ్ వెల్లడించాడు. ఆటోక్లేవ్ ఏరోస్పేస్ ఉత్పత్తులను తయారీకి వినియోగిస్తారని, దీనిలో అవసరమైన మార్పులు చేసి ఈ నెలలో పని ప్రారంభించనున్నట్లు స్పేస్ సెంటర్ అధికారులు ప్రకటించారు.