రైతులకు ముఖ్యమైన అలర్ట్... పది రోజుల్లో ఈ పథకంలో చేరకపోతే భారీ నష్టం...?

Reddy P Rajasekhar

2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలో వచ్చిన రోజు నుంచి రైతులకు ప్రయోజనం చేకూరేలా అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం రైతుల ఖాతాల్లో 6,000 రూపాయలు జమ చేస్తూ పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్రం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన కూడా ఒకటి. 
 
ఈ పథకం ద్వారా కేంద్రం పంటలకు బీమా కల్పిస్తోంది. వరదలు, తుఫానులు, వడగళ్లు, భారీ వర్షాలు, కరువు వల్ల ప్రతి సంవత్సరం రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. విత్తనం వేసిన రోజు నుంచి పంట చేతికి వచ్చేంత వరకు ప్రకృతి వైపరిత్యాల వల్ల భార్తీగా నష్టపోతున్నారు. ఫసల్ బీమా యోజన పథకంలో చేరితే నష్టపోయిన పంటకు బీమా డబ్బులు పొందడంతో పాటు పంట దెబ్బతింటే కూడా పరిహారం లభిస్తుంది. 
 
రైతులకు ఈ స్కీమ్ వల్ల ఎంతో మేలు చేకూరుతుంది. 2016 జనవరి 13వ తేదీన కేంద్రం ఈ పథకాన్ని మొదలుపెట్టింది. నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ బదులుగా కేంద్రం ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఖరీఫ్ పంటలకు ఇన్సూరెన్స్ కొరకు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి జూలై 31 చివరి తేదీ. గడువులోపు ఈ పథకంలో చేరితే పంట నష్టం వాటిల్లినా కేంద్రం బీమా రూపంలో సహాయం చేస్తుంది. 
 
పంట విత్తనం నుంచి కోయడం వరకు ఎక్కడ నష్టం వాటిల్లినా ఈ పథకం వర్తిస్తుంది. ఖరీఫ్ పంటలకు రైతులు ఇన్సూరెన్స్ ప్రీమియంలో 2 శాతం, రబీ పంటలకు ఇన్సూరెన్స్ ప్రీమియంలో 1.5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. వాణిజ్య పంటలు, హార్టికల్చర్ పంటలకు మాత్రం 5 శాతం ప్రీమియం చెల్లించాలి. https://pmfby.gov.in/ వెబ్ సైట్ ద్వారా రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పట్టా పాస్‌‌బుక్ ఈ పథకానికి దరఖాస్తు చేసేందుకు అవసరమవుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: