
దారుణం : యువతిపై సామూహిక అత్యాచారం చేయించిన మరో యువతి.. చివరికి..?
తాజాగా జరిగిన ఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది . పని పాట లేకుండా తిరుగుతూ చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతూ కాలం గడుపుతున్న ఓ గ్యాంగ్ బాలికను బంధించి చిత్రహింసలకు గురిచేసి నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం లో వెలుగులోకి వచ్చింది. కోరుకొండ మండలం మధురవాడ కి చెందిన ఓ మహిళ కు ముగ్గురు కుమార్తెలు. ఇక భర్త చాలా కాలం క్రితం మృతి చెందడంతో ముగ్గురు ఆడపిల్లలను తల్లి ఎంతో కష్టంగా పోషిస్తోంది. ఇక ఇటీవలే టెన్త్ పాస్ అయిన కుమార్తెకు రాజమహేంద్రవరంలో ఓ దుకాణంలో పని ఇప్పిస్తానని చెప్పింది స్థానికంగా ఉండే అనిత అనే మహిళా.
ఈనెల 12వ తేదీన ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తీసుకొని వెల్లింది . సాయంత్రం సమయంలో అనిత మాత్రమే తిరిగి వచ్చింది. దీంతో తన కూతురు గురించి ఆరా తీసింది తల్లి. నాకు తెలీదు అంటూ అనిత సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చిన తల్లి పోలీసులను ఆశ్రయించింది. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఈనెల 16వ తేదీన బాలిక ఆచూకీ గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న సదరు బాలికను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మత్తు మందుకు అలవాటు ఉన్న అనితకు బ్లేడు బ్యాచ్ తో పరిచయాలు కూడా ఉన్న నేపథ్యంలోనే సదరు బ్లేడ్ బ్యాచ్ కి బాలికను అప్పజెప్పింది అనిత. దీంతో బస్టాండ్ వద్ద ఓ రూమ్ కు తీసుకెళ్లి మూడు రోజుల పాటు చిత్రహింసలకు గురిచేస్తూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక షాక్ నుంచి తేరుకున్న సదరు బాలిక ఈ నిజాలు అన్ని బయటపెట్టడంతో అనితను, నిందితులను అరెస్టు చేసిన పోలీసులు కటకటాల వెనక్కి తోసారు.Powered by Froala Editor