కరోనా వైరస్ వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పతనం..!!

Suma Kallamadi

కరోనా వైరస్ కారణముగా అన్ని రంగాల వారికి నష్టం చేకూరింది.ఆ నష్టాల జాబితాలో  ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం కూడా చేరిపోయింది. ఈ సంవత్సరం 2020 తొలి అర్ధభాగంలో రియల్ ఎస్టేట్  రంగం బాగా కృంగిపోయింది.అయితే తాజాగా  నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ వెల్లడించిన నివేదిక ఈ విషయాన్ని తెలిపింది. కరోనా ప్రభావంతో రియల్ ఎస్టేట్ రంగంలో అనుకోని మార్పులు వచ్చాయి. దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్  లావాదేవీలు, విక్రయాలు గతంలో ఎన్నడూ లేనట్లుగా పదేళ్ల కనిష్టానికి పడిపోయినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ ఒక  నివేదికలో వెల్లడించింది. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే క్రమంలో ఉద్దేశించిన లాక్‌డౌన్ కాలంలో డిమాండ్ మరింతగా క్షీణించినట్లు తెలిపింది.

 

 

.

 

ఇళ్ళు కొనుగోలు చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. దీనితో రియల్ ఎస్టేట్ రంగంలో అమ్మకాలు కూడా చాలా తగ్గిపోయాయి.దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో రియల్ ధరలు బాగా  తగ్గాయి. కిందటి సంవత్సరం జనవరి నుండి జూన్ మధ్య కాలంలోని  అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది 54 శాతం మేరకు అమ్మకాలు తగ్గాయి. మొత్తంమీద 59,538 యూనిట్లకే అమ్మకాలు పరిమితమయ్యాయి. ఇవి కూడా ఈ సంవత్సరం ప్రధమార్ధంలోనే జరిగాయి.ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణే, అహ్మదాబాద్ నగరాలలో నైట్‌ఫ్రాంక్ ఇండియా సంస్థ అధ్యయనం చేసింది.ఇక చెన్నై, హైదరాబాద్ నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా క్షీణించింది.

 

 

 

 

ఏప్రిల్-జూన్ మధ్యలో అమ్మకాలు మరి తక్కువ అయిపోయాయి. అంటే లాక్ డౌన్ సమయంలో భారీగా 84 శాతం మేర తగ్గి కేవలం 9,632 యూనిట్లకు పరిమితమైంది. ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో డిమాండ్ పూర్తిగా క్షీణించినట్లు తెలిపింది. ఈ మూడు ప్రాంతాల్లో అయితే సేల్స్ దాదాపు జీరోకు పడిపోయాయి.అందులో మన హైదరాబాద్ నగరం కూడా ఉండడం గమనించాలిసిన విషయం. గత రెండేళ్లుగా రియల్ ఎస్టేట్ రంగానికి పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం రియల్ ఎస్టేట్ రంగంలో అనుకోని  పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశిర్ బైజూల్ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: