ఆ టీడీపీ ఎమ్మెల్యే పెద్ద పదవి పైనే కన్నేశాడుగా ? వైసీపీలోకి బ్రేక్ పడింది అందుకేనా ?

టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు అనే వార్తలు వచ్చినప్పుడల్లా, గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే satya PRASAD' target='_blank' title='అనగాని సత్యప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">అనగాని సత్యప్రసాద్ పేరు తెరపైకి వస్తోంది. ఆయన త్వరలో వైసీపీలో చేరుతున్నారని, టిడిపికి రాజీనామా చేయబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తుంటాయి. ఆయన కూడా ఆ తరహాలోనే వ్యవహరిస్తూ వస్తున్నారు. ఒక దశలో టిడిపికి రాజీనామా చేసి, వైసీపీలో చేరిపోతున్నారు అంటూ పెద్దగా హడావుడి జరుగుతూ ఉంటుంది. కానీ ఆయన మాత్రం పసుపు కండువా పక్కన పెట్టేందుకు ఇష్టపడంలేదు. అలాగే బీజేపీలోకి ఆయన వెళ్ళిపోతున్నారు అనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అది కూడా జరగలేదు. కొద్ది నెలల క్రితం ఆయన వైసీపీలో చేరేందుకు దాదాపు అంతా సిద్ధం చేసుకుని, వైసీపీ కీలక నాయకులను కూడా కలిసి అనేక డిమాండ్లు పెట్టడం, వాటికి వైసీపీ నుంచి కూడా సానుకూలంగా నిర్ణయాలు వెలువడడంతో, ఇక ఆయన చేరిక లాంఛనమే అనుకుంటుండగా.. సత్యప్రసాద్ మాత్రం వైసీపీలో చేరకుండా ఆగిపోయారు. దీని వెనుక పెద్ద కథే ఉన్నట్లుగా టిడిపి నాయకులే చెవులు కొరుకుంటున్నారు.

అనగాని వైసీపీలో చేరితే నియోజకవర్గంలో ఆయన పెత్తనానికి ఎటువంటి డోకా లేకుండా చేస్తామని వైసీపీ ఆయనకు హామీ ఇచ్చిందట. అయితే ఆ హామీ ఇచ్చిన జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న, మోపిదేవి వెంకటరమణ తనకు అడుగడుగున అడ్డుపడతారనే ఉద్దేశంతో ఆగిపోయారట. అలాగే మోపిదేవి వెంకటరమణ సోదరుడు హరినాథ్ దూకుడును తట్టుకుని నిలబడడం కష్టమని భావించే వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో టిడిపి ఆయనను బుజ్జగిస్తూపార్టీలో మంచి భవిష్యత్తు కల్పించడంతో మంచి పదవులు ఇస్తామని, రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి ఢోకా లేకుండా చూస్తామని హామీ ఇచ్చిందట.

 

ఈ సందర్భంగా త్వరలో ఏర్పడబోయే రాష్ట్ర కమిటీలో ఆయనకు రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చేందుకు చంద్రబాబు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అలాగే అనగాని సామాజిక వర్గానికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు కేఈ కృష్ణమూర్తి రాజకీయాలకు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచనలో ఉండటంతో, పార్టీలో తన రాజకీయ భవిష్యత్తుకు ఢోకా ఉండదనే అభిప్రాయంతోనూ, ఆయన చివరి నిమిషంలో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: